Begin typing your search above and press return to search.
డాక్టర్ సుధాకర్‌కు టీడీపీ ఎంపీ టికెట్ జస్ట్ మిస్?!
By: Tupaki Desk | 18 May 2020 12:10 PM GMTఏపీకి చెందిన సస్పెన్షన్‌కు గురైన వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఉదంతంలో మరో రాజకీయ దుమారం తెరమీదకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేసిన సుధాకర్‌ను విచారణ అనంతరం అధికారులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. గత శనివారం విశాఖలో ఆర్ధనగ్నంగా నిరసనకు దిగడంతో న్యూసెన్స్ కేసు నమోదు చేసి ఆయనకు చికిత్స అందిస్తుండగా ఆయన మానసిక స్థితి సరిగా లేదనే విషయం తెరమీదకు వచ్చింది. దీనికి తోడుగా తాజాగా మరో ఉదంతం వెలుగులోకి వచ్చింది. డాక్టర్ సుధాకర్ గతంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీ టికెట్ కోసం ప్రయత్నించారట.
ఏపీలో కరోనా పాజిటివ్ వ్యక్తులకు ట్రీట్మెంట్ చేసే ఆసుపత్రిలో మాస్క్‌లు, శానిటైజర్లు లేవని డాక్టర్ సుధాకర్ ఆరోపించగా.. విధుల నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో ఆయన శనివారం విశాఖ పోర్టు ఆసుపత్రి సమీపంలో అర్ధనగ్నంగా హడావిడి చేయడం, దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. డాక్టర్ సుధాకర్ మద్యం సేవించి ఉండటం, ఆ మత్తులోనే అసభ్య పదజాలంతో అందరినీ దూషిస్తూ చికిత్సకు సహకరించలేదనే వార్తలు వచ్చాయి. డాక్టర్ సుధాకర్ ఎక్యూట్ హ్యాండ్ యాడ్ కమంట్ సైకో సిస్‌తో సఫర్ అవుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు మానసిక వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ మానసిక వైద్యశాలలో వైద్యనిపుణుల పర్యవేక్షణలోనే ఉన్నారని ప్రభుత్వ మానసిక వికలాంగుల ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ సుధారాణి వెల్లడించారు.
అయితే, ఈ పరిణామాలపై గత ఎన్నికల ముందు వరకు టీడీపీలో ఉండి అనంతరం వైసీపీలో చేరిన మాజీ ఎంపీ పండుల రవీంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగంలో కొనసాగుతూనే 2019 ఎన్నికల్లో ఎంపీ టికెట్ కోసం డాక్టర్ సుధాకర్ తెలుగుదేశం పార్టీ నేతలతో భేటీ అయ్యారని ఆయన తెలిపారు. అయితే, ఆయనకు టికెట్ ఇవ్వలేదని తెలిపారు. చివరి నిమిషంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు టికెట్ నిరాకరించడంతో...డాక్టర్ సుధాకర్ మానసిక స్థిరత్వం కోల్పోయారని తెలిపారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో దళిత డాక్టర్ అనే పేరుతో ఏపీ మాజీ సీఎం కామెంట్లు చేయడం సరికాదని రవీంద్రబాబు తప్పుపట్టారు. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిగా మాత్రమే డాక్టర్ సుధాకర్ చేష్టలు చూడాలని కోరారు.