Begin typing your search above and press return to search.
నన్నుచూపించరు కానీ,నా చెప్పుల్ని చూపిస్తారా?
By: Tupaki Desk | 13 Aug 2015 5:51 AM GMTఆ మధ్యన చెక్కి (వేరుసెనగ.. బెల్లంతో తయారు చేసి స్నాక్స్) కుంభకోణంలో చిక్కి.. అందరికి సుపరిచితురాలిగా మారిన మహారాష్ట్ర మంత్రి పంకజా ముండే తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమె తన చెప్పుల్ని వేరే వారి చేత మోయించటంపై మీడియా ఫోకస్ పెట్టటం.. అది కాస్త వివాదస్పదం కావటంతో పంకజాకు కోపం వచ్చేసింది.
మహారాష్ట్రలోని కరవు ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంగా చోటు చేసుకున్న ఘటన ఆమెను వివాదంలోకి నెట్టేలా చేసింది. సోన్ పేట్ లో పర్యటించిన సందర్భంగా.. అక్కడ బురద ఉండటంతో ఆమె తన చెప్పుల్ని వదిలి.. బురదలో నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె చెప్పులను వేరే వారు మోసుకెళ్లటం కనిపించింది. దీంతో.. మీడియా కెమేరాలన్నీ ఆ అంశం మీదనే దృష్టి పెట్టాయి.
దీంతో.. ఆమె మీద విపక్షాలు విరుచుకుపడటం స్టార్ట్ చేయగానే.. పంకజా అలెర్ట్ అయిపోయారు. ఈ ఘటనకు సంబంధించి తన వాదనను వినిపించిన ఆమె.. తాను కావాలని ఆ పని చేయలేని చెబుతూ.. తన చెప్పుల మీద దృష్టి పెట్టిన మీడియా కెమేరాలు.. తాను చెప్పుల్లేకుండా బురదలో నడవటాన్ని మాత్రం చూపించలేదేం అని ప్రశ్నించారు.
తాను విడిచిన చెప్పులు.. తన సహాయకుడు తీసుకెళ్లటం తాను గమనించలేదని.. అయినా.. సదరు సహాయకుడు ప్రభుత్వ ఉద్యోగి కాదని.. తాను వ్యక్తిగతంగా నియమించుకున్న వ్యక్తిగా చెప్పుకున్న ఆమె.. తన చెప్పుల మీద ఫోకస్ చేస్తున్న మీడియా.. తన మీద ఎందుకు ఫోకస్ చేయటం లేదంటూ వాపోతున్నారు. అయినా.. మంత్రిగారు బురదలో నడవటం చిన్న విషయమా? దాన్ని హెడ్ లైన్స్ లో చూపిస్తే పంకజాకు ఎంతో ఆనంద పడేవారట్లుంది. ఎంతసేపటికి తమను ప్రముఖంగా చూపించాలని తాపత్రపడే నేతలు.. తమకు వ్యతిరేకంగా ఒక్క మాట రావటానికి మాత్రం అస్సలు ఓప్పుకోరేం..?