Begin typing your search above and press return to search.

మహిళా మంత్రా లేడీ డానా?

By:  Tupaki Desk   |   8 Oct 2016 11:38 AM GMT
మహిళా మంత్రా లేడీ డానా?
X
తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్న మాహారాష్ట్ర మంత్రి పంకజ ముండే మరోసారి వివాదాల్లోకెక్కారు. అహ్మద్‌ నగర్‌ జిల్లాలోని ప్రముఖ ఆలయంలో పనిచేసే పూజారి నామ్‌ దేవ్‌ శాస్త్రి మహరాజ్‌ పై ఆమె బెదిరింపులకు దిగిన ఆడియో క్లిప్‌ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దసరా సందర్భంగా ఆమె ఆ గుడిలో ప్రసంగిస్తానని ప్రతిపాదించగా పూజారి అందుకు వ్యతిరేకించారట. దీంతో ఆమె మండిపడుతూ... ‘‘దసరా పండగ వరకు నేనేమీ అనను.. నా మనుషులను కూడా కామ్ గా ఉండమని చెబుతాను. ఆ తరువాత నీ సంగతి తేలుస్తా.. గతంలో మీరు అడిగినవన్నీ ఇచ్చాను. ప్రభుత్వ పథకానికి చెందిన డబ్బు మీకిచ్చాను గుర్తుందా? ’’ అంటూ బెదిరించిన ఆడియో క్లిప్ బయటపడింది.

దసరా పండుగ సమయంలో గొడవ చేయడం తనకు ఇష్టం లేదని.. ఆ తరువాత నా మనుషులు నీ సంగతి చూస్తారని పంకజ ఆ పూజారిని బెదిరించారు. ఏమీ అనకుండా ఉంటున్నామంటే చేతకాని వాళ్లం కాదని.. తమ మనుషులు ఎవరినైనా కొట్టగలరు, తప్పుడు కేసులు పెట్టి వాళ్లను అక్కడినుంచి పారిపోయేలా చేయగలరని ఆమె పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు మహారాష్ట్రలో పెనువివాదం రేపుతున్నాయి. చట్టాన్ని పరిరక్షించాల్సిన మంత్రి చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా వ్యాఖ్యానిస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

కాగా గతంలో ఆమె తీవ్ర నీటి కరవుతో అల్లాడిన లాతూరులో పరిస్థితుల చూడ్డానికి వెళ్లి అక్కడ ఎండిపోయిన డ్యాముల వద్ద సెల్ఫీలు దిగి వాటిని సోషల్ మీడియాలో పెట్టి వివాదంలో చిక్కుకున్నారు. అంతేకాదు.. పంకజ రౌడీయిజం చేస్తున్నారన్న ఆరోపణలూ వస్తున్నాయి. దీంతో ఆమె మంత్రా... లేదంటే లేడీ డానా అని మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/