Begin typing your search above and press return to search.

'మహా' లో బీజేపీ కి మరో షాక్..ఎన్సీపీ లోకి పంకజ్‌ ముండే?

By:  Tupaki Desk   |   3 Dec 2019 9:11 AM GMT
మహా లో బీజేపీ కి మరో షాక్..ఎన్సీపీ లోకి  పంకజ్‌ ముండే?
X
మహారాష్ట్ర బీజేపీ నేత పంకజ్ ముండే సొంత పార్టీకి షాక్ ఇచ్చారు. తన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా నుంచి బీజేపీ - రాజకీయ ప్రస్తావనను తొలగించారు. అలాగే కొత్తగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఉద్ధవ్ థాకరేకు ఆమె అభినందనలు తెలిపారు. ట్విట్టర్ లో బీజేపీ ప్రస్తావన తీసేయడంతో పాటుగా - సీఎం ఉద్దవ్ థాకరే కి విషెష్ చెప్పడంతో ఒక్కసారిగా పంకజ్ ముండే పార్టీ మారబోతున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, మారిన పరిస్థితుల్లో రేపటి మార్గాన్ని సరిచూసుకోవాల్సి ఉందని చెప్పడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది.

ఆమె ట్వీట్లపై బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ స్పందించారు. పంకజ్ ముండే పార్టీని వీడడం లేదని స్పష్టం చేశారు. ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీడ్ జిల్లాలోని పార్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పంకజ్ ముండే తన పెదనాన్న కొడుకు - ఎన్సీపీ అభ్యర్థి ధనుంజయ్ ముండే చేతిలో ఓటమి పాలయ్యారు. పంకజ్ ముండే తండ్రి గోపీనాథ్ ముండే 2014లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో గెలిచిన పంకజ్‌ కు మహారాష్ట్ర కేబినెట్‌ లో చోటు లభించింది.