Begin typing your search above and press return to search.

పన్నీర్ కు ఊహించని మద్దతు వచ్చేసింది

By:  Tupaki Desk   |   9 Feb 2017 7:21 AM GMT
పన్నీర్ కు ఊహించని మద్దతు వచ్చేసింది
X
అన్ని జాగ్రత్తలు తీసుకున్న చిన్నమ్మకు ఊహించని రీతిలో పెనుసవాల్ ఎదురైంది. ఆమె ఏ మాత్రం అంచనా కట్టని అంశంలో జరిగిన నష్టం అంతాఇంతా కాదనే చెప్పాలి. ఎమ్మెల్యేల్నితన అధీనంలో ఉంచుకొని.. బలమంతా తనదేనని చెబుతున్న చిన్నమ్మకు పార్టీ ఐటీ విభాగం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదనే చెప్పాలి. పార్టీలో చురుగ్గా ఉండే ఐటీ విభాగం చిన్నమ్మ గుర్తించే లోపే చేయాల్సినడ్యామేజ్ ని చేసేసింది.

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే అన్నాడీఎంకే ఐటీ విభాగం.. తాజా సంక్షోభం నేపథ్యంలో పన్నీర్ సెల్వంకు అనుకూలంగా నిలిచింది. ఎప్పటికప్పుడు పన్నీరు సెల్వానికి అనుకూలంగా ట్వీట్లు పోస్ట్ చేయటమే కాదు.. మొత్తం ఎమ్మెల్యేల సెల్ ఫోన్ నెంబర్ల జాబితాను ఇమేజ్ రూపంలో మార్చేసి ట్వీట్లుగా పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు.. పన్నీరు సెల్వంకు మద్దతు ఇద్దామని.. అందుకోసం ప్రతిఒక్కరూ.. తమ తమ ఎమ్మెల్యేలకు ఫోన్ చేయటమో.. మెసేజ్ చేయటమో చేయాలని కోరుతున్నారు.

శశికళ నుంచి రాష్ట్రాన్ని కాపాడటం కోసం ఈ పని చేయాలంటూ ట్విట్టర్లో అభ్యర్థన ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాదు.. ఈ ట్వీట్ చూసినోళ్లను రీట్వీట్ చేయాలని.. మరింత మందికి చేరవేయాలన్న సూచన చేస్తుండటం గమనార్హం. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను గుర్తించి.. చిన్నమ్మకు తమ మద్దతును ఉపసంహరించుకునేలా ప్రజల నుంచే ఒత్తిడి పెంచేలా ఐటీ విభాగం ప్లాన్ చేసిందన్న మాట వినిపిస్తోంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/