Begin typing your search above and press return to search.
చిన్నమ్మను మరింత ఇరకాటంలో పడేసిన సెల్వం
By: Tupaki Desk | 20 May 2017 4:32 AM GMTదివంగత జయలలిత నమ్మినబంటు - తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం రాజకీయంగా తన పట్టు బిగించేందుకు, అన్నాడీఎంకే వర్గపోరులో ఆదిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందుకోసం ఢిల్లీ వేదికగా సెల్వం పావులు కదుపుతున్నారు. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి చిన్నమ్మ వీకే శశికళ వర్గాన్ని విజయవంతంగా దూరం పెట్టగలిగిన సెల్వం భవిష్యత్ లో అసలే మాత్రం దగ్గర కాకుండా చూసేందుకు ఎత్తుగడలు సిద్ధం చేశారు. ఈమేరకు తాజాగా ఢిల్లీ పర్యటనలో విజయవంతంగా స్కెచ్ వేశారు.
రాష్ట్ర పర్యటనలో ఉన్న సెల్వం హఠాత్తుగా ఢిల్లీ పర్యటన పెట్టుకోవడం ఆశ్చర్యకరంగా మారింది. అయితే హస్తినకు చేరిన సెల్వం ఆండ్ టీం ఎన్నికల కమిషన్ కలిసింది. ఏఐఏడీఎంకే కార్యాలయాన్ని ఉపయోగించుకోకుండా వీకే శశికళ వర్గాన్ని నిలువరించాలని కోరింది. అంతేకాకుండా పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళకు పదోన్నతి కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ వర్గం తాజాగా కొన్ని పత్రాలను ఈసీకి సమర్పించిందని ఎన్నికల కమిషన్ కార్యాలయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై తమ రెండు వర్గాల మధ్య పరిష్కారం కుదిరే వరకూ ఎఐఎడిఎంకె అధికార పత్రిక ‘డా.నమదు ఎంజిఆర్’ను శశికళ ఆధీనంలో ఉంచరాదని పన్నీర్‌సెల్వం వర్గీయులు ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసినట్లు ఆవర్గాలు తెలిపారు.
అన్నాడీఎంకే అధినేత్ర జయలలిత మరణంతో వచ్చిపడిన ప్రతిష్టాత్మకమైన ఆర్‌కె.నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఎఐఎడిఎంకె పేరును గానీ, పార్టీ ఎన్నికల చిహ్నమైన ‘రెండు ఆకుల’ గుర్తును గానీ ఉపయోగించడానికి వీల్లేదని ఈ రెండు వర్గాలకు స్పష్టం చేస్తూ ఎన్నికల కమిషన్ మార్చి 23వ తేదీన తాత్కాలిక ఉత్తర్వు జారీ చేసింది. అయితే ఈ నియోజకవర్గంలో ఓట్లను కొనుగోలు చేసేందుకు భారీ మొత్తంలో డబ్బును ఉపయోగించారన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో ఈ ఉప ఎన్నిక రద్దయిన విషయం తెలిసిందే. మళ్లీ ఈ ఎన్నిక జరిగే తేదీని ఈసీ ప్రకటించాల్సి ఉంది. మొత్తంగా చిన్నమ్మను మరింత ఇరకాటంలో పడేయటమే లక్ష్యంగా సెల్వం ముందుకు సాగుతున్నట్లు, అందులోనూ ఢిల్లీ వేదికగా ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంటున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/