Begin typing your search above and press return to search.
చిన్నమ్మకు నిద్ర లేకుండా చేసేలా పన్నీర్ మాట
By: Tupaki Desk | 13 Feb 2017 6:53 AM GMTవిధేయుడు.. విధేయుడు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసేవారంతా ఇప్పుడు పన్నీర్ ను మరోలా చెప్పక తప్పని పరిస్థితి. సాఫ్ట్ గా కనిపించే పన్నీర్ లో ఇలాంటి యాంగిల్ కూడా ఉందా? అంటూ అందరూ ఆశ్చర్యపోయేలా ఆయన వ్యవహరిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా ఆయన వేస్తున్న ఎత్తులు ప్రత్యర్థి వర్గాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పటికప్పుడు తన ప్లాన్లనుమార్చేసుకుంటూ పోతున్న పన్నీర్ తీరు శశికళ వర్గానికి ఇప్పుడు సరికొత్తగా మారింది.
ఎర్రబడిన కళ్లతో.. కంట కన్నీరు ఉబికి వస్తున్న వేళ.. తీవ్రస్థాయిలో ఫైర్ అవుతూ చిన్నమ్మ మీడియాతో మాట్లాడటం అయిపోయిన వెంటనే.. ఆమెకు కౌంటర్ గా అన్నట్లుగా పన్నీర్ తన వాయిస్ ను విప్పారు. కూల్ గా మాట్లాడుతూనే.. అమ్మ సెంటిమెంట్ ను లైవ్ లో ఉంచేసి.. తననెంతగా అవమానించారన్న విషయాల్ని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అమ్మ ఆశయాల్ని తూట్లు పొడిచేలా వ్యవహరించారన్న కొత్త విషయాన్ని తెర మీదకుతీసుకొచ్చారు.
తనను అమ్మ ఎంతో అభిమానించే వారని.. కానీ చిన్నమ్మ భరించలేకపోయేవారని కొత్త తరహా ఆరోపణ చేసిన పన్నీర్.. తాను సింహాన్ని కానే కాదంటూ శశికళ మాటల్ని ఎలా దెబ్బ కొట్టాలో అలా దెబ్బ కొట్టారని చెప్పాలి. పన్నీర్ చెప్పిన మాటల్లో కీలకమైన అంశాల్ని చూస్తే..
= అమ్మ కోసం ఎన్నో అవమానాలు భరించేవాడ్ని. అమ్మ నన్నుఅప్యాయంగా పలుకరిస్తే చాలు.. శశికళ నుంచి చీవాట్లు పడేవి. పదిహేను.. పదహారేళ్లుగా అడుగడుగునా అవమానాల్నిమౌనంగా భరించా. నాలోనేను రోదించా. అమ్మ తన వారసుడ్ని తయారు చేసుకునే ప్రయత్నం చేసినా.. శశికళ అడుగడుగునా అడ్డుపడేవారు. పార్టీలో ఉన్న వారిని బయటకు పంపేలా చేసేవారు.
= శశికళ వర్గంలోని ఎమ్మెల్యేలు వారి.. వారి నియోజకవర్గాలకు వెళ్లాలి. అక్కడి ప్రజల మాటను వారు వినాలి.నేను ఎదుర్కొన్న కష్టాలు.. చేసిన సేవల్ని అమ్మ స్వయంగా కార్యకర్తలకు వివరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
= శశికళ నన్ను అవమానించినప్పుడు.. ఆ విషయాల్ని అమ్మ దృష్టికి తీసుకెళ్లలేదు. నన్ను బయటకు పంపేందుకు కుట్రలు పన్నినా అమ్మ కోసం అన్నీ దిగమింగుకున్నా. చాడీలు చెప్పటం.. నిందలువేయటం నాకు చేతకాదు. నేను సింహాన్ని కాదు.
= ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా స్వతంత్రంగా వ్యవహరించలేని నిస్సహాయుడిగా ఉండాల్సి వచ్చేది. జయలలిత ఆసుపత్రిలోఉన్నప్పడు కనీసం ఆమెదగ్గరకు వెళ్లనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. అమ్మ మరణించిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ.. శశికళ ఆపరిణామాల్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు.
= అమ్మ రక్తసంబంధీకులు దీప.. దీపక్ లను కూడా అమ్మ దగ్గరకు వెళ్లనివ్వలేదు. ఆమె దగ్గరకు రానివ్వకుండా చూశారు.
= శశికళ క్యాంపులోని ఎమ్మెల్యేలు ఫోన్లోటచ్ లో ఉన్నారు. నేనే అక్కడికి వెళ్లి.. వారిని బయటకు తీసుకొచ్చే అధికారం చేతిలో ఉన్నా.. నావల్ల శాంతిభద్రతలకు ముప్పు వాటిల్లకూడదన్న ఉద్దేశంతో సంయమనం పాటిస్తున్నా. పాలన సజావుగా సాగేందుకు.. సెక్రటేరియట్ కు వెళ్లి.. సీఎంగా విధులు నిర్వర్తిస్తా.