Begin typing your search above and press return to search.
అమ్మపార్టీ విలీనం..పన్నీర్ సెల్వంకు కొత్త పదవి
By: Tupaki Desk | 21 Aug 2017 12:53 PM GMTతమిళనాడులో అధికార అన్నాడీఎంకే పార్టీలో నెలకొన్న చీలిక ఎపిసోడ్ కు శుభం కార్డు పడింది. ఏఐఏడీఎంకేలోని రెండు వర్గాలు విలీనమయ్యాయి. అమ్మ పార్టీలోని రెండు వర్గాలు విలీనమైన తరువాత పార్టీ మార్గదర్శక కమిటీకి కన్వీనర్ గా పన్నీర్ సెల్వం బాధ్యతలు చేపట్టనున్నారు. మార్గదర్శక కమిటీ సహ కన్వీనర్ గా పళనిస్వామి బాధ్యతలు నిర్వర్తిస్తారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి - మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నేడు మెరీనా బీచ్ లో ఉన్న జయలలిత స్మారకం వద్దకు వెళ్లి ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పళనిస్వామి మాట్లాడుతూ తమిళనాడు చరిత్రలో విడిపోయిన పార్టీలు ఏవీ తిరిగి కలవలేదని అన్నారు. అలా కలిసిన ఏకైక పార్టీ అన్నాడీఎంకె మాత్రమేనని ఆయన చెప్పారు. అందరమూ కలిసి ఐకమత్యంతో జయలలిత పాలనను ముందుకు తీసుకువెళతామని ఆయన అన్నారు. పార్టీని ఇకపై మార్గదర్శక కమిటీ నిర్వహిస్తుందని వివరించారు. మార్గదర్శక కమిటీకి పన్నీర్ సెల్వం నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, తన వర్గాలు రెండూ ఒక్కటైనట్లుగా మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ప్రకటించారు. పార్టీ ఐకమత్యం కోసం శాయశక్తులా కృషి చేస్తానని పార్టీ మార్గదర్శక కమిటీ కన్వీనర్ గా నియమితులైన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. నేటితో తనపై ఉన్న భారం తొలగిపోయిందని ఆయన అన్నారు. సంతోషంగా విలీనానికి అంగీకరించానని ఆయన చెప్పారు.
అనంతం వేగంగా మారిన పరిణామాల్లో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగింది. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో జరిగిన మంత్రివర్గ విస్తరణ కార్యక్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావు పన్నీర్ సెల్వంతో ప్రమాణం చేయించారు. పన్నీర్ సెల్వంకు ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా అప్పగించనున్నారు. రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో పాండ్య రాజన్ తో గవర్నర్ విద్యాసాగర్ రావు ప్రమాణ స్వీకారం చేయించారు. పన్నీర్ సెల్వంకు అత్యంత సన్నిహితుడైన పాండ్యరాజన్ తమిళ అధికార భాష - తమిళ సంస్కృతి శాఖలను కేటాయించారు.
కాగా, అన్నాడీఎంకే (అమ్మ) వర్గం నాయకుడు దినకరన్ నివాసంలో ఆ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎఐఎడిఎంకె (అమ్మ) వర్గం నాయకుడు దినకరన్ నివాసంలో ఆ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఎఐఎడిఎంకె పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గాలు రెండూ విలీనం దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో వారి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.ఎఐఎడిఎంకెలో వర్గాల విలీనంపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. పార్టీనుంచి శశికళను తొలగించాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతోంది. కాగా శశికళను తొలగించడంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని పళనిస్వామి వర్గం పేర్కొంటోంది. ఎఐఎడిఎంకె పళనిస్వామి - పన్నీర్ సెల్వం వర్గాలు రెండూ విలీనం దిశగా అడుగులు పూర్తయిన క్రమంలో వారి భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అన్నాడీఎంకే నుంచి పార్టీ నుంచి శశికళను తొలగించాలని పన్నీర్ సెల్వం వర్గం పట్టుబడుతున్న సమయంలో ఈ సమావేశం హాట్ హాట్ గా సాగుతోంది. కాగా శశికళను తొలగించడంలో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని పళనిస్వామి వర్గం పేర్కొన్నట్లు సమాచారం.