Begin typing your search above and press return to search.
పన్నీర్ కు మరో స్వీట్ న్యూస్..
By: Tupaki Desk | 13 Feb 2017 6:43 AM GMTతమిళనాట సాగుతున్న రాజకీయ సంక్షోభంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం పదవి చేతికి వచ్చేసిందన్న సమయంలో సీన్ మొత్తం మారిపోవటంపై చిన్నమ్మ ఎంతగా రగిలిపోతున్నారన్న విషయం ఆమె రెండు గంటల మాటలు విన్న వారికి చాలాబాగా అర్థమైంది. గవర్నర్ మొదలు.. కేంద్రం వరకూ ఎవరితోనైనా ఢీ అంటే ఢీ అన్నట్లుగా ఆమె చెబుతున్న మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారటమే కాదు.. తనతో పాటు అందరూ సింహాలే అంటూ ఆమె తన వర్గంలో ఉత్సాహాన్ని నింపుతున్నారు.
ఓపక్క శశికళ తీరు ఇలా ఉంటే.. మరోవైపు ఆమె వర్గానికి చెందిన ఎంపీలు పన్నీర్ వర్గంలోకి షిఫ్ట్ కావటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే 11 మంది ఎంపీలు పన్నీరు సెల్వం వర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరో పది మంది ఎంపీలు ఆయనకు మద్దతు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త.. పన్నీరు శిబిరంలో మరింత సంతోషాన్ని రేకెత్తిస్తోంది.
కేంద్రప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎంపీలు ఈ పదిమందిలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకూ అంతర్గత రాజకీయాల మీద దృష్టి పెట్టిన పన్నీర్ సెల్వం.. రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే వరకూ తన ధర్మాన్ని తాను నిర్వర్తించాలన్న నిర్ణయానికి వచ్చారు. తమిళనాడు అపద్ధర్మ సీఎంగా వ్యవహరిస్తున్న ఆయన.. ఈ రోజు సచివాలయానికి వెళ్లి.. సీఎంగా తన బాధ్యతల్ని తానునిర్వహించాలని భావిస్తున్నరు. గవర్నర్ నిర్ణయం తీసుకునే వరకూ తాను ముఖ్యమంత్రినేనన్న విషయాన్ని ఆయన తన ప్రత్యర్థి వర్గానికి స్పష్టం చేయటంతో పాటు.. ఇప్పటికే తానిచ్చిన ఆదేశాల అమలు ఎలా ఉందన్న విషయాన్ని ఆయన సమీక్షించనున్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు శశికళ వర్గం తమ క్యాంప్ రాజకీయాల్ని కొనసాగిస్తోంది. కొత్తగా మరో పది మంది ఎంపీల మద్దతు పన్నీర్ శిబిరానికి కొత్త శక్తిని నింపుతోంది.