Begin typing your search above and press return to search.
జయ నమ్మిన బంటు బీజేపీలోకి వెళ్తున్నారా?
By: Tupaki Desk | 30 July 2022 6:47 AM GMTఒ. పన్నీరు సెల్వం (ఓపీఎస్).. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు అత్యంత నమ్మిన బంటు. జయలలిత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన పలు సందర్భాల్లో ఒ. పన్నీరు సెల్వాన్ని తన స్థానంలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. మళ్లీ ఆమె తిరిగి వచ్చాక అంతే వినయ విధేయతలతో ఆమె స్థానాన్ని ఆమెకు అప్పగించేవారు.. పన్నీరు సెల్వం.
జయ ఆకస్మిక మరణంతో ఓపీఎస్ కు కష్టాలు మొదలయ్యాయి. పార్టీని, ప్రభుత్వాన్ని శశికళ లాక్కోవాలని చూడటం.. ఈ క్రమంలో పన్నీరుసెల్వం ఒంటరిగా మిగిలిపోవడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ తర్వాత శశికళ కూడా అక్రమాస్తుల కేసులో జైలుకు పోవడంతో పళనిస్వామిని ముఖ్యమంత్రిగా శశి కూర్చోబెట్టారు. ఆ తర్వాత బీజేపీ అధిష్టానం తన రాజకీయ క్రీడలో భాగంగా ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్), ఓపీఎస్ లను ఒక్కటి చేసింది. ముఖ్యమంత్రిగా పళనిస్వామి, పార్టీ అధినేతగా పన్నీరు సెల్వం ఉండేటట్లు ఒప్పందం చేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. పార్టీ కోకన్వీనర్ గా పళనిస్వామి, డిప్యూటీ సీఎంగా పన్నీరు సెల్వం ఉండేలా కూడా ఒప్పందం కుదిర్చింది.
అయితే గతేడాది తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డీఎంకే ఓడిపోయింది. దీంతో మళ్లీ పార్టీపై పెత్తనానికి కీచులాటలు మొదలయ్యాయి. అత్యధికుల ఎమ్మెల్యేల మద్దతు, జిల్లా స్థాయిల్లో పార్టీ నేతల మద్దతు ఉండటంతో ఎడపాటి పళనిస్వామి పార్టీపై పట్టు సాధించారు.
సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు కూడా చేపట్టారు.అంతేకాకుండా పన్నీరు సెల్వాన్ని, ఎంపీగా ఉన్న ఆయన కుమారుడిని, మరికొందరిని పార్టీ నుంచి బహిష్కరించారు. దీనిపై పన్నీరు కోర్టుకు వెళ్లినా ఆయనకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం బీజేపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలో చెస్ ఒలింపియాడ్ జరగుతుంది. దీని ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ వచ్చారు. విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికినవారిలో పన్నీరు సెల్వం కూడా ఉన్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల ఫొటోలతో పన్నీరు సెల్వం హోర్డింగులను, భారీ ఫ్లెక్సీలను చెన్నై నగరమంతా వేయించారు.
ఈ నేపథ్యంలో పన్నీరు సెల్వం బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని వార్తలు వస్తున్నాయి. బీజేపీ కూడా తమిళనాడులో ఎప్పటి నుంచో బలపడటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా అది వర్కవుట్ కావడం లేదు. పన్నీరు సెల్వం అన్నాడీఎంకే నుంచి తీసుకొచ్చే గ్రూపుతో బీజేపీ బలపడుతుందని ఆ పార్టీ అధిష్టానం ఆశిస్తోంది. ఈ క్రమంలో పన్నీర్ సెల్వం త్వరలోనే కాషాయ గూటికి చేరే అవకాశాలున్నాయని రాజకీయ నేతలు విశ్లేషిస్తున్నారు.