Begin typing your search above and press return to search.
రోహిత్, మహీని ఓడించాడంటే పంత్ మామూలు స్వింగ్ లో లేడు..!
By: Tupaki Desk | 22 April 2021 4:43 AM GMTగాయం కారణంగా శ్రేయస్ అయ్యర్ ఈ సారి ఐపీఎల్ కు దూరం కావడంతో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ బాధ్యత పంత్ తీసుకున్నాడు. అయితే పంత్ ను కెప్టెన్ గా తీసుకోవడం పట్ల విమర్శలు వచ్చాయి. ఇటు సీనియర్ క్రికెటర్లు, అటు నెటిజన్లు.. ఏ మాత్రం అనుభవం లేని పంత్.. ఢిల్లీ జట్టును ఎలా నడిపిస్తాడంటూ విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలను చాలెంజింగ్‌గా తీసుకున్న పంత్ దూసుకుపోతున్నాడు. దిగ్గజ జట్లు ముంబై ఇండియన్స్, సీఎస్‌కేలను సైతం మట్టి కరిపించాడంటే అతడి స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
గతంలో విమర్శించిన వాళ్లు సైతం ఇప్పుడు పంత్ ను మెచ్చుకుంటున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ కు అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన ఉంది. మరోవైపు ఫీల్డింగ్ లోనూ ఆ జట్టు బాగా రాణిస్తుంది. దీనికి తోడు గబ్బర్ ( శిఖర్ ధవన్) ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ శిఖర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ అంశాలన్నీ పంత్‌కు కలిసి వస్తున్నాయి.
బౌలింగ్ విషయంలోనూ పంత్ ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. టీమ్ ను అద్భుతంగా లీడ్ చేస్తున్నాడు. దీంతో పంత్ కెప్టెన్సీ పట్ల ప్రశంసలు దక్కుతున్నాయి. నిజానికి గత ఏడాది ఐపీఎల్లో పంత్ పెద్దగా రాణించలేదు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా టూర్, ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్‌లలో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పంత్ కు కెప్టెన్సీబాధ్యతలు అప్పగించింది. బాధ్యతలను పంత్ ఎంతో చక్కగా వినియోగించుకుంటున్నాడు.
తనను తాను సమర్థుడైన కెప్టెన్ గా నిరూపించుకుంటున్నాడు. ఈ ఎడిషన్‌లో ఢిల్లీ నాలుగు మ్యాచ్‌లు ఆడి వాటిలో మూడు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ వంటి పెద్ద జట్లపై ఢిల్లీ గెలవడం గమనార్హం.