Begin typing your search above and press return to search.
నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ గొడవ..ఉత్తిదేనా!
By: Tupaki Desk | 18 Oct 2019 3:29 PM GMTఒకవైపు దేశ ఆర్థిక పరిస్థితి మాంద్యం దిశగా సాగుతోందనే విశ్లేషణలు సాగుతూ ఉన్నాయి. నోబెల్ అవార్డు గ్రహీతలు అయినా ఆర్థిక వేత్తలు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే మోడీ సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో దేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా నిలిచాయి మీడియాలో.
పరకాల ప్రభాకర్ కూడా రాజకీయ నేతగా వ్యవహరించాడనే సంగతి తెలిసిందే. మొదట బీజేపీ, తర్వాత ప్రజారాజ్యం, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీల్లో పని చేశారాయన. చంద్రబాబు హయాంలో కూడా వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత తెరమరుగు అయ్యారు.
ఇలాంటి నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆయనా స్పందించారు. భార్య ఆర్థిక శాఖా మంత్రి అయినప్పటికీ ఆయన నెగిటివ్ కామెంట్లు చేశారు. అవి మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. ఈ నేపథ్యంలో దీని వెనుక అసలు కథ ఏమిటి? అంటే.. అంతా ఉత్తిదే అనే విశ్లేషణ వినిపిస్తూ ఉంది.
ఇదంతా మీడియా అటెన్షన్ కోసమే అని.. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని నిర్మలా సీతారామన్ భర్త విమర్శించడం, ఆ మాటలను ఆమె తిప్పి కొట్టడం.. కౌంటర్ ఇవ్వడం.. ఇదంతా మీడియా టెన్షన్ కోసం పనికి వస్తుంది తప్ప, మీడియాకు మసాలా వార్తగా పనికొస్తుంది తప్ప.. ఈ మాటలతో దేశానికి ఒనగూరే ప్రయోజనం లేదని విశ్లేషకులు అంటున్నారు.