Begin typing your search above and press return to search.

సీఈవో భేటీలతోనే దిక్కులేదు పరకాల?

By:  Tupaki Desk   |   19 Jan 2016 7:11 AM GMT
సీఈవో భేటీలతోనే దిక్కులేదు పరకాల?
X
ప్రయత్నం చేయటాన్ని ఎవరూ కాదనరు. కానీ.. గోరంత విషయాన్ని కొండంతగా చెప్పుకోవటమే చిరాగ్గా ఉంటుంది. తాజాగా ఏపీ రాష్ట్ర సలహాదారుగా పని చేస్తున్న పరకాల ప్రభాకర్ చెబుతున్న మాటలే దీనికి నిదర్శనం. ఏపీ ముఖ్యంత్రి స్విట్జర్లాండ్ లో జరిగే దావోస్ ఆర్థిక సదస్సుకు వెళ్లటం తెలిసిందే. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచటానికి.. పెట్టుబడులు ఆకర్షించటానికి తాజా విదేశీ పర్యటగా చెబుతున్నారు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. అదేదో అద్భుత కార్యంగా పరకాల లాంటి వారు చెబితేనే ఒళ్లు మండుతుంది.

ఎందుకంటే.. దావోస్ వెళ్లే చంద్రబాబు.. అక్కడ గూగుల్.. మైక్రోసాఫ్ట్.. సాఫ్ట్ బ్యాంక్.. హెచ్ పీ.. ఫిలిప్స్.. సీమెన్స్ లాంటి సంస్థల ప్రతినిధులతో .. ప్రొ క్లాస్ స్క్వాబ్ లాంటి ఆర్థికవేత్తలతో సమావేశం కానున్నట్లు చెప్పారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ తోనూ బాబు ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు వెల్లడించారు.

గూగుల్.. మైక్రోసాఫ్ట్ సీఈవోలతోనే బాబు భేటీ అయితేనే ఒక్క ప్రాజెక్ట్ వర్క్ వుట్ అయ్యింది లేదు. సీఈవోలతో కానిది.. ప్రతినిధులతో భేటీల వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో పరకాల వారికే తెలియాలి. ఇక.. దేశంలోనే ఉండే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ను దేశంలో భేటీ కాకుండా.. దావోస్ లో ప్రత్యేకంగా భేటీ కావటం ఏమిటో..? ఆ మతలబు ఏమిటో పరకాల వారికే అర్థం కావాలి? రాజన్ తో భేటీ గురించి కూడా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరమేమిటో ఆయనకే చెప్పాలి.

పరకాల లాంటి వారి మాటలు విన్నప్పుడు.. పని తక్కువ.. మాటలు ఎక్కువన్న భావన కలగక మానదు. తెలంగాణ.. ఏపీ ముఖ్యమంత్రులు తీరు చూసినప్పుడు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చంద్రబాబు విదేశీ పర్యటనలు చేసి సాధించిందేమీ కనిపించదు. అదే రీతిలో కేసీఆర్ ఫారిన్ టూర్లకు వెళ్లకుండా కోల్పోయింది ఏమీ లేదనిపించక మానదు. మరింత చిన్న విషయాలకు మా గొప్పలు చెప్పుకోవటం ఏమిటో..?