Begin typing your search above and press return to search.

గోక్కుంటున్న గజ్జి బ్యాచ్ కి అంటూ దులిపేసిన పరకాల!

By:  Tupaki Desk   |   4 Aug 2021 10:49 AM GMT
గోక్కుంటున్న గజ్జి బ్యాచ్ కి అంటూ దులిపేసిన పరకాల!
X
మాటలో నెమ్మదితనం.. హుందాతనానికి నిలువెత్తు అడ్రస్ అన్నట్లుగా ఉండే రూపం గుర్తుకు వస్తుంది పరకాల ప్రభాకర్ గుర్తుకు వచ్చినంతనే. అలాంటి పరకాల ఎప్పుడైతే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి ఆయన తీరులో మార్పు వచ్చింది. ఇక.. విమర్శలు మొదలు పెట్టారో.. ఆయన్ను టార్గెట్ చేసే బ్యాచ్ ఒకటి తయారైంది. ఇష్టారాజ్యంగా చేసే వ్యాఖ్యలకు.. ఆ తీరులోనే సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారో ఏమో కానీ.. పరకాల తాజాగా చేసిన ట్వీట్లు పెను సంచలనంగా మారాయి. పరకాల లాంటి పెద్ద మనిషి ఎందుకిలాంటి ట్వీట్లు చేస్తున్నారన్న సందేహం ఇప్పుడు వ్యక్తమవుతోంది.

చంద్రబాబు హయాంలో ప్రభుత్వ మాజీ సలహాదారుగా వ్యవహరించిన ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త అన్న విషయం తెలిసిందే. టీవీ చానల్ లో వివిధ అంశాల మీద చర్చలతో సుపరిచితుడైన ఆయన.. చిరంజీవికి సలహాదారుగా వ్యవహరించటం.. ఆ తర్వాత తేడా వచ్చేయటం తెలిసిందే. తన మీద కత్తి కట్టి.. అదే పనిగా విమర్శలు చేసే వారికి.. మండిపడేవారికి సమాధానం ఇచ్చేలా ఆయన తాజా వ్యాఖ్యలు ఉన్నాయి.

తనకు అలవాటైన భాషలో కాకుండా అద్దెకు తెచ్చుకున్నట్లుగా ఆయన తాజా మాటలు ఉన్నాయి. తనను తిట్టే వారిని పరోక్షంగా తిట్టేస్తూ.. తాను టార్గెట్ చేసింది ఎవరన్న విషయాన్ని అర్థమయ్యేలా ట్వీట్లు చేయటం ఆసక్తికరంగా మారాయి. ‘‘కిరాయి ముడుతోందా నన్ను తిడుతున్నందుకు? కానీ జోరు తగ్గిందే. కిట్టుబాటు కావటం లేదా? సరే.. నేల టిక్కెట్ ఈల బ్యాచ్ బాబాయ్ లకు.. పిన్నిలకు ఈ ప్రశ్నలకు సమాధానం రాయించుకురండి ఆఫీసులో ఎవరితోనైనా. 2009లో కాంగ్రెసోళ్ల పంచెలూడగొడతానని.. మరి కాంగ్రెస్ లో ఎందుకు చేరినట్లు? 2014లో సైకిల్ ఎందుకు ఎక్కినట్లు?’’ అంటూ ప్రశ్నల్ని సంధించారు.

తాజా ట్వీట్లు చూస్తే.. పరకాల లక్ష్యం పవన్ కల్యాణ్.. ఆయన బ్యాచ్ అన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆయన మరో ట్వీట్ లో చెప్పేశారు. ‘‘2017 లో పాచిపోయిన లడ్డూ అన్నవారు ఇప్పుడు కమలం పువ్వు చెవిలో పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నట్టు.. భీమవరం, వైజాగుల్లో ఏదో పీకేస్తానని తుస్పుమన్నారు శుంఠలు, ఎందుకని.. రేపటి వరకు వీటిల్తో పిసుక్కోండి. రేపు తీరుబడి అయ్యాక మళ్ళీ ఇంకోసారి వీపు పగిలేలా బాదుతా ఇంకా ఏరైనా మిగిలితే’’ అంటూ మండిపడ్డారు.

ఇంతకీ పరకాలకు ఇంత కోపం ఎందుకు వచ్చినట్లు? ఈ మధ్యలో ఏమైంది? ఆయనకు ఉన్నట్లుండి ఇంత ఆగ్రహావేశాల్ని ప్రదర్శిస్తున్నది ఎందుకన్న విషయంపై మాత్రం క్లారిటీ రాని పరిస్థితి. రెండు రోజుల క్రితం ట్విటర్ లో ఆయనో ఆసక్తికర ట్వీట్ చేశారు. అందులో ఏమున్నదంటే.. ‘‘ఇంకా కుక్కలు మొరుగుతూనే ఉన్నట్లున్నాయి. కానివ్వండి. మళ్లీ రేపు తీరుబడి అయ్యాక ఒక్కొక్క కుక్కనీ మూతి పగిలేలా కొడతాను. ఏ కుక్కనీ నిరాశపర్చను. ఆఫీసుకి వెళ్లి కిరాయి తీసుకోవటం మర్చిపోకండి. రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా గెలిపించుకోలేకపోయిన వాళ్లు అంతకన్నా ఇంకే చేయగలరు’’ అంటూ 2019 ఎన్నికల్లో పవన్ ఓటమిని ప్రస్తావించటం గమనార్హం.

పరకాల ఇంత సీరియస్ గా వ్యాఖ్యలు చేయటం వెనుక ఏం జరిగిందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవల కాలంలో పీకే అండ్ కోను ఈ స్థాయిలో విరుచుకుపడిన వారు కనిపించరనే చెప్పాలి. ‘ఇంకా గోక్కుంటున్న గజ్జి బ్యాచ్ కి’ అంటూ చేసిన వ్యాఖ్య చూస్తే.. తనను అనే వారిని ఏ మాత్రం విడిచిపెట్టన్న హెచ్చరిక పరకాల చేసినట్లుగా చెప్పాలి. ఇంతకీ పరకాల వారు.. మీకేమైంది? ఎందుకిలాంటి ట్వీట్లు చేసినట్లు? అన్నది మాత్రం పెద్ద ప్రశ్నగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.