Begin typing your search above and press return to search.
శేఖర్ రెడ్డి నెట్ వర్క్ ఎంత పెద్దదో
By: Tupaki Desk | 22 Dec 2016 7:49 AM GMTతమిళనాడుకు చెందిన కాంట్రాక్టర్.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ సభ్యుడైన శేఖర్ రెడ్డి యవ్వారం తెలిసిందే. వందల కోట్ల రూపాయిల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేయటం.. ఇటీవల జరిపిన సోదాల్లో అయ్యగారి భాగోతం బయటకు రావటం తెలిసిందే. భారీగా నగదు.. కేజీల కొద్దీ బంగారాన్ని ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న వేళ.. ఇంతకీ ఇంత భారీ ఎత్తున కొత్త నోట్లు శేఖర్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చాయన్నది పెద్ద సందేహంగా మారింది.
ఈ వ్యవహారంపై ఆరా తీసిన అధికారులకు కోల్ కతాకు చెందిన బడా వ్యాపారవేత్త పారస్ మాల్ లోధా సాయం చేసినట్లుగా గుర్తించారు. శేఖర్ రెడ్డితో పాటు.. ఢిల్లీకి చెందిన న్యాయవాది రోహిత్ టాండన్ కు చెందిన రూ.25కోట్ల పాత నోట్లను కొత్త నోట్లుగా మార్చేందుకు సైతం లోధా సాయపడ్డారు. కోల్ కతాలోని ప్రముఖ వ్యాపారవేత్తల్లో ఒకరుగా చెప్పే లోథాను తాజాగా ముంబయి ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారు.
తాజా పరిణామం స్పష్టం చేసేదేమిటంటే.. శేఖర్ రెడ్డి లింకులు ఎంత విస్తృతంగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేయటంతో పాటు.. దేశవ్యాప్తంగా కొత్తనోట్లను అక్రమపద్ధతిలో మార్చేందుకు వ్యవస్థీకృత వ్యవస్థ పని చేస్తుందన్న భావన కలగక మానదు. సరిగ్గా దృష్టి పెడితే.. ఇందుకు సంబంధించిన భారీ కుంభకోణం బయటకు రావటం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. శేఖర్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాతి రోజే.. లోధా అరెస్ట్ కావటం.. రానున్నరోజుల్లో మరెంతమంది అరెస్ట్ అవుతారన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారిందని చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/