Begin typing your search above and press return to search.

ఆడ‌పిల్ల‌ల‌కు శాపంగా అమ్మ ఒడి!

By:  Tupaki Desk   |   21 Jun 2019 6:08 AM GMT
ఆడ‌పిల్ల‌ల‌కు శాపంగా అమ్మ ఒడి!
X
ఎన్నిక‌ల ముందు నుంచి న‌వ‌ర‌త్నాల పేరుతో జ‌గ‌న్ చెబుతున్న సంక్షేమ ప‌థ‌కాల్లో కీల‌క‌మైన‌ది అమ్మ ఒడి. ఈ కార్య‌క్ర‌మం కింద త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చేర్పిస్తే.. ఏడాదికి రూ.15వేలు చొప్పున ఇవ్వ‌నున్నారు. దీని ద్వారా పిల్ల‌ల్ని ప్ర‌తి ఒక్క‌రు స్కూల్ కు పంపుతార‌ని.. దీంతో సాంఘికంగా మెరుగైన స‌మాజానికి కార‌ణ‌మ‌వుతుంద‌ని జ‌గ‌న్ ఆశించారు.

ఆర్థిక కార‌ణాల‌తో ఏ ఒక్క‌రు చ‌దువుకు దూరం కాకూడ‌ద‌న్న‌దే ఉద్దేశం. పేద‌వారు ఆర్థిక కార‌ణాల‌తో త‌మ పిల్ల‌ల్ని స్కూళ్ల‌కు పంప‌లేని ప‌రిస్థితి ఉండ‌టంతో.. అమ్మ ఒడి కార్య‌క్ర‌మంతో ఆ లోటు తీరుతుంద‌ని జ‌గ‌న్ భావించారు. అందుకే న‌వ‌ర‌త్నాల్లో అమ్మ ఒడి కార్య‌క్ర‌మానికి పెద్ద‌పీట వేశారు. ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా ప్ర‌భుత్వ‌.. ప్రైవేటు స్కూల్ ఏదైనా పిల్ల‌ల్ని చేర్చొచ్చ‌ని.. పిల్ల‌ల్ని చేర్చిన ప్ర‌తి కుటుంబానికి రూ.15వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని అందిస్తామ‌ని చెప్పారు.

అయితే.. ఇలా చేస్తే ప్రైవేటు స్కూళ్ల‌కు పిల్ల‌ల్ని పంపుతార‌ని.. ప్ర‌భుత్వ స్కూళ్లు ఖాళీ అవుతాయ‌న్న మాట వినిపిస్తోంది. దీంతో.. అమ్మ ఒడి కార్య‌క్ర‌మాన్ని ప్రైవేటు స్కూళ్ల‌కు ఆపి.. ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో చేర్పించే వారికే అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించారు. ప్ర‌స్తుతానికి ఈ ప‌థ‌కానికి సంబంధించిన విధివిధానాలు స్ప‌ష్టంగా విడుద‌ల చేయ‌న‌ప్ప‌టికీ ఒక కొత్త విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అమ్మ ఒడి ప‌థ‌కాన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌కు మాత్ర‌మే ప‌రిమితం చేసే అవ‌కాశం ఉంద‌ని గ్ర‌హించిన ప‌లువురు త‌ల్లిదండ్రులు.. మ‌గ‌పిల్లాడిని ప్రైవేటు పాఠ‌శాల‌కు.. ఆడ పిల్ల‌ల్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌కు పంప‌టం షురూ చేసిన‌ట్లుగా తెలుస్తోంది.ప‌లు జిల్లాల్లో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో ఆడ‌పిల్ల‌ల ఆడ్మిష‌న్లు పెద్ద ఎత్తున రావ‌టంతో.. ఈ అంశంపై దృష్టి పెట్టిన అధికారుల‌కు తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామం అర్థ‌మైంది.

దీంతో.. స‌దుద్దేశంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అమ్మ ఒడి కార్య‌క్ర‌మం ఆడ‌పిల్ల‌ల్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల్ల‌లో నింపేస్తున్న తీరు వారికి శాపంగా మారింద‌న్న మాట వినిపిస్తోంది. గ‌తంలో క‌ష్టమో.. న‌ష్ట‌మో ఇద్ద‌రు పిల్ల‌లు ఉంటే.. ఇద్ద‌రిని ఒకే స్కూల్లో పెట్టేవారు. ఇప్పుడేమో ఆడ‌పిల్ల‌ల్ని ప్రభుత్వ పాఠ‌శాల‌లకు ప‌రిమితం చేస్తున్నారు. దీంతో అమ్మ ఒడి ప‌థ‌కం ఏపీలోని ఆడ‌పిల్ల‌ల‌కు శాపంగా మారిన విష‌యాన్ని అధికారులు గుర్తిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. ఈ ప‌థ‌కానికి మ‌రింత ప‌దును పెట్టేలా చేసి.. అబ్బాయిలు.. అమ్మాయిలు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల వైపు అడుగులు వేసేలా నిర్ణ‌యాలు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది.