Begin typing your search above and press return to search.

బెడ్రూమ్ ‌లో ప్రియుడితో నగ్నంగా కూతురు ..చూసిన పేరెంట్స్ ఏంచేశారంటే ?

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:30 AM GMT
బెడ్రూమ్ ‌లో ప్రియుడితో నగ్నంగా కూతురు ..చూసిన పేరెంట్స్  ఏంచేశారంటే ?
X
ప్రేమ .. ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైంది. ఈ రోజుల్లో ప్రేమకి వయస్సు తో కూడా సంబంధం లేకుండా పోతుంది. కొందరు తెలిసి తెలియని వయస్సులో చేసే తప్పుల వల్ల రెండు కుటుంబాలు భాదపడుతున్నాయి. కానీ , ఈ మధ్య కాలంలో పరువు కోసం ఏం చేయడానికి కూడా వెనకాడడం లేదు తల్లిదండ్రులు. కన్నపిల్లల కంటే కూడా పరువుకు ఎక్కువ విలువ ఇవ్వడంతో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా అదే కోణంలో మరో ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో శృంగారంలో పూర్తిగా మునిగిపోయిన సమయంలో కూతురిని ఆ భంగిమలో చూసిన కుంటుంబ సభ్యులు కోపంతో రగిలిపోయారు. ఇద్దరినీ ఒకేచోట చూసిన కుటుంబ సభ్యులు వారిని గదిలో బంధించి సజీవ దహనం చేశారు. ఈ దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. పరువు కోసమే హత్యలకు తెగబడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన పై పూర్తి వివరాల్లోకి వెళ్తే .. బాందా జిల్లా మతౌద్ ఏరియా కర్చా గ్రామానికి చెందిన ప్రియా అదే ప్రాంతానికి చెందిన శంకర్ కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇద్దరు ఏకాంతంలో మునిగిపోయారు. ఇద్దరూ శృంగారంలో ఉండగా సడెన్‌ గా యువతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రియుడితో గదిలో నగ్నంగా అసభ్యకర రీతిలో ఉన్న కూతురిని చూసి ఆగ్రహంతో రగిలిపోయారు. తమ పరువు తీసిందన్న కోపంతో కూతురిని, ఆమె ప్రియుడిని నిలువునా నిప్పు పెట్టి చంపేశారు. ఆ చిన్న గుడిసె బయటి నుంచి తాళం వేసేశారు. అగ్నికీలల్లో చిక్కుకున్న ప్రేమికులు మంటల్లో కాలిపోయారు. ప్రియుడు శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా 80 శాతం గాయాలతో ప్రియురాలిని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ఆమె పరిస్థితి విషమించడంతో కాన్పూర్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. ఆమెను కాన్పూర్ తీసుకెళ్తుండగా మార్గం మధ్యలో ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేశామని, మిగిలిన కుటుంబ సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యలు పరువు హత్యలుగా భావిస్తున్నట్లు తెలిపారు.