Begin typing your search above and press return to search.
ఆ తల్లితండ్రులు మహా ముదుర్లు సుమీ!
By: Tupaki Desk | 4 Aug 2016 7:08 AM GMTతెలంగాణ ఎంసెట్ - 2 పరీక్ష పేపర్ లీకవ్వడం - దానిపై సీఐడీ ఇన్విస్టిగేషన్ చేయడం.. తప్పనిపరిస్థితుల్లో తిరిగి పరీక్ష నిర్వహించాల్సి వస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం తెలిసిందే. అయితే ఈ వ్యవహారానికి సంబందించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఎంసెట్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని కొంతమంది తల్లితండ్రులు గొడవపెడుతుంటే... కొంతమంది తల్లితండ్రులు తమ జీవితాలతో ఆడుకుంటున్నారని బ్రోకర్లు లబోదిబోమంటున్నారట.
విషయంలోకి వస్తే.. ప్రశ్నాపత్రన్ని లీక్ చేసి తమకు ఇచ్చేందుకు కొంతమంది తల్లితండ్రులు బ్రోకర్లతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ ఒప్పందం ప్రకారం ముందుగా బ్రోకర్లకు ఒక్కో విద్యార్ధి తల్లితండ్రులు రూ. 35 లక్షలు చెల్లించాలి. అలా కానిపక్షంలో విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు బ్రోకర్ల వద్ద పెట్టి పరీక్ష రాసిన తర్వాత, మంచి ర్యాంక్ వస్తే అప్పుడు డబ్బులు చెల్లించి తమ సర్టిఫికెట్లు తిరిగి తీసుకోవచ్చు. దీంతో ఒప్పందం ప్రకారమే కొంతమంది తల్లితండ్రులు డబ్బులు చెల్లించగా.. మరి కొందరు మాత్రం సర్టిఫికెట్లను తాకట్టు పెట్టారట.
వీరిలో రమేష్ అనే బ్రోకర్ వద్ద ఐదుగురు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తాకట్టు పెట్టినట్టు సీఐడీ దర్యాప్తులో బయటపడింది. అయితే ఒప్పందం ప్రకారం లీకేజీ ప్రశ్నాపత్రం అందుకున్న విద్యార్థులు పరీక్ష పాసై ర్యాంకు సాధించినప్పటికీ బ్రోకర్ కు మాత్రం డబ్బు చెల్లించేందుకు నిరాకరిస్తున్నారట. దీంతో తనవద్దనున్న ఒరిజినల్ సర్టిఫికెట్ల గురించి సదరు బ్రోకర్ ప్రస్తావిస్తే.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురతిరిగి "నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో" అంటూ ఎదురు బెదిరించారట. తాము ఒక్క రూపాయి కూడా చెల్లించేది లేదు - సర్టిఫికెట్లు కాల్చేసుకుంటే.. కాల్చేసుకో అంటూ వారు ఎదురు చెప్పారట. సర్టిఫికెట్ల విషయంలో పేరెంట్స్ ఇంత దైర్యంగా ఎందుకు మాట్లాడుతున్నారా అని ఆరా తీయగా.. షాకింగ్ విషయం తెలిసిందట సదరు బ్రోకర్ కి. అదేమిటంటే... బ్రోకర్ల వద్ద విద్యార్థుల తల్లితండ్రులు తనకా పెట్టిన సర్టిఫికెట్లు ఒరిజినల్ కాదు.. కలర్ జిరాక్స్ విత్ లామినేషన్! దీనితో కంగుతిన్న బ్రోకర్ విద్యార్థుల తల్లిదండ్రులను డబ్బుల విషయంలో బతిమిలాడుకున్నట్టు సీఐడీ విచారణలో వెలుగుచూసింది. దీంతో.. ఆ తల్లితండ్రులు మహా ముదుర్లు సుమీ అని ఆశ్చర్యపోతున్నారట విషయం తెలిసినవారు!!