Begin typing your search above and press return to search.
అఫ్ఘాన్‌లో కచిన్నారులను ఇచ్చేస్తున్న తల్లిదండ్రులు.. ఏం జరిగింది?
By: Tupaki Desk | 19 Aug 2021 3:30 PM GMTతాలిబన్ల పాలనలోకి వెళ్లిపోయిన అఫ్ఘానిస్తాన్‌లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని.. క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఏ తాలిబన్ తన పీకపై కత్తిపెట్టి.. తమ ప్రాణం తీసుకుంటాడో.. తమ ఆడపిల్లల మానాన్ని చెరబడతాడోనని.. ఇక్కడి ప్రజలు హడలిపోతున్నారు. ఎందుకంటే.. గత 20 ఏళ్ల కిందట.. తాలిబన్ల చెరలో ఉన్నప్పుడు ఏం జరిగిందో వారికి అనుభవం ఉంది కనుక! పగబట్టిన మిన్నాగును తలపించే.. తాలిబన్ల వైఖరితో ఇప్పుడు.. కూడా అదే పరిస్థితి వస్తుందని.. అఫ్ఘన్లు.. కంటిపై కునుకు కూడా లేకుండా గడుపుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పుడు.. తమను ఆదుకునేవారికోసం.. తమ ప్రాణాలు రక్షించేవారి కోసం.. వారు ఎదురు చూస్తున్నారు. అఫ్ఘన్‌ను వదలి వెళ్లిపోయేందుకు ఇక్కడి ప్రజలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో.. కూడా తెలిసిందే. కొందరు ఇటీవల అమెరికా నుంచి వచ్చిన విమానం ఎక్కేందుకు ప్రయత్నించి.. దానిలో ఖాళీలేక.. చక్రాలు పట్టుకునైనా వెళ్లేందుకు ప్రయత్నించి.. ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి తాలిబన్లంటే.. ఇక్కడి వారికి ఎంత జడుపు ఉందో ఇట్టే అర్ధమవుతుంది. అయితే.. తాము ప్రజలను క్షమిస్తున్నామని.. మహిళల హక్కులకు భంగం కలిగించబోమని.. తాలిబన్లు ప్రకటించినా.. వారిలో విశ్వాసం కలిగించలేక పోతున్నారు.
ఈ క్రమంలో కనీసం .. తమను కాకపోయినా.. తమ చిన్నారులను. ముఖ్యంగా 10 ఏళ్ల వయసుదాటిన తమ ఆడపిల్లలను ఎవరైనా తీసుకువెళ్లి ఆదుకోవాలని.. ఆప్ఘన్లు .. కన్నీరు మున్నీరవుతున్నారు. ఇవే దృశ్యా లు.. కాబూల్ విమానాశ్రయంలో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి. కాబూల్‌లోని అంతర్జాతీయ విమానా శ్రయం ప్రజలతో నిండిపోయింది. తమను కాపాడండి అంటూ విదేశీ సిబ్బందిని వేడుకుంటున్నారు. తమను కాకపోయినా.. తమ పిల్లలను అయినా తీసుకెళ్లండి అంటూ ప్రాధేయపడుతున్నారు. ఇలాంటి బాధాకరమైన ఘటనలు కాబుల్ ఎయిర్ పోర్టులో దర్శనమిస్తున్నాయి.
వాస్తవానికి కాబూల్ ఎయిర్‌పోర్ట్ గోడకు అటువైపు బ్రిటన్, అమెరికా సహా ఇతర దేశాల సిబ్బంది ఉన్నారు. ఇటువైపు ఆఫ్గన్ మహిళలు, ప్రజలు ఉన్నారు. తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేమని, తమను రక్షించాలని విదేశీ సైన్యాన్ని వారు వేడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాలిబన్ల పాలనలో ఆడపిల్లలకు రక్షణ ఉండదని, చిన్న పిల్లలను తమ వెంటనే తీసుకెళ్లిపోవాలంటూ ఆఫ్గన్ మహిళలు ఇతర దేశాల సైన్యాన్ని వేడుకుంటున్నారు. ఏడాది నుంచి పదేళ్ల లోపు వయసున్న ఆడపిల్లల్ని ఎయిర్ పోర్ట్ గోడ దగ్గరకు తీసుకువచ్చి సైన్యాన్ని ప్రాథేయ పడుతున్నారు.
‘‘అయ్యా.. మేం తాలిబన్ల చెరలో ఉన్నాం. మాకు బతుకులేదు. మా పిల్లలు మాతో ఉంటే వారికి కూడా చావు తప్పదు. లేదంటే మానం, ఆత్మాభిమానం చంపుకుని బతకాలి. కాదని ఎదిరిస్తే వారి చేతుల్లో చావాలి. దయచేసి తీసుకెళ్లిపోండి.’’ అంటూ ఈ వైరల్ వీడియోల్లో వేడుకుంటున్నారు. తమను దేశం దాటించాలని అమెరికన్ సైన్యాన్ని ఆఫ్గన్ యువతులు వేడుకుంటున్నారు. ఇదీ... ఇప్పుడు ఆఫ్ఘన్ లో కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యం. మరి ఏదేశం వీరి మొర వింటుందో.. ఆదుకుంటుందో చూడాలి. ఇప్పటికే జీ-7 దేశాలు.. ఆఫ్ఘన్ పరిస్థితిపై చర్చించేందుకు షెడ్యూల్ డిసైడ్ చేసుకున్నాయి. కానీ, ఈలోపే ఏదైనా జరిగితే.. ఎవరు బాధ్యులు? అనే ప్రశ్న.. ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నంది.