Begin typing your search above and press return to search.

టెన్త్‌ ఎగ్జామ్స్‌ ...గోడలెక్కుతున్న పేరెంట్స్

By:  Tupaki Desk   |   5 March 2020 6:15 AM GMT
టెన్త్‌ ఎగ్జామ్స్‌ ...గోడలెక్కుతున్న పేరెంట్స్
X
ప్రస్తుతం దేశం మొత్తం ఎగ్జామ్స్ సీజన్ నడుస్తుంది. అకాడమిక్ ఇయర్ ఎండింగ్ కి చేరుకోవడంతో విద్యార్థులు వార్షిక పరీక్షలకి సిద్ధమౌతున్నారు. ఒకవైపు పరీక్షలకి విద్యార్థులు ప్రిపేర్ అవుతుంటే , మరోవైపు పరీక్ష రాసే విద్యార్ధులకి చిట్టీలు అందించడం ఎలా అని కొందరు యువకులు కూడా వారికంటే ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారు. ఏడాది మొత్తంలో ఏ మాత్రం చదివారో తెలుసుకోవడానికి ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్స్ పెడుతుంటే ..ఆ ఎగ్జామ్స్ లో వచ్చే మార్కులని పరువుకి సంబంధించినదిగా భావించి ..కొందరు యువకులు ఎగ్జామ్స్ రాసే వారికీ ఎంతో కస్టపడి కాపీలు అందిస్తున్నారు.

ఇకపోతే , తాజాగా మహారాష్ట్రలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ ప్రారంభమైయ్యాయి. దీనితో పరీక్షలు రాస్తున్న టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు చీటీలు అందించడానికి అత్యుత్సాహం చూపిస్తూ పరీక్ష హాలు దగ్గరి ప్రహారీ గోడ ఎక్కి మరీ తమ వారికి కాపీలు అందించడానికి ట్రై చేసారు కొందరు యువకులు. ఈ సంఘటన మహారాష్ట్రలోని యావాత్‌ మాల్‌ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యావాత్‌ మాల్‌ జిల్లాలోని ‘మహాగావ్‌ జిల్లా పరిషత్‌ స్కూల్‌’ లో పదవ తరగతి పరీక్షలు రాస్తున్న తమ వారికి చీటీలు అందించడానికి కొందరు యువకులు ఎగబడ్డారు. పరీక్ష హాలు దగ్గర ఉన్న ఎత్తైన అడ్డుగోడని ఎక్కి మరీ కాపీ కొట్టడానికి చీటీలు అందించారు. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ.. కిటికీల దగ్గర చేరి చీటీలు అందించారు. ఈ వ్యవహారాన్ని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇన్విజిలేటర్లు, అక్కడి అధికారులు చూసి కూడా చూడనట్టు వదిలేయడం గమనార్హం.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా, 2015లోనూ ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. బిహార్‌ లోని వైశాలిలో టెన్త్‌ ఎగ్జామ్స్‌ రాస్తున్న తమ పిల్లలకు.. 6 అంతస్తుల భవనాన్ని తాళ్లతో ఎక్కి మరీ చీటీలు అందించారు కొందరు. ఆ సంవత్సరం బిహార్‌ వ్యాప్తంగా కాపీ చేయటానికి సహకరిస్తున్న 1000 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.