Begin typing your search above and press return to search.

కూతురిపై త‌ల్లిదండ్రుల క‌ర్క‌శం.. చంప‌లేదు.. కానీ, ఘోరం చేశారు

By:  Tupaki Desk   |   16 Nov 2022 3:13 AM GMT
కూతురిపై త‌ల్లిదండ్రుల క‌ర్క‌శం.. చంప‌లేదు.. కానీ, ఘోరం చేశారు
X
ప్రేమ పెళ్లిళ్లు నేటి రోజుల్లో స‌హ‌జంగా మారిపోయాయి. వీటిని త‌ల్లిదండ్రులు కూడా చాలా మంది యాక్స‌ప్ట్ చేస్తున్నారు. అయితే, తెలంగాణ‌లోని ఓ కుటుంబం మాత్రం త‌మ బిడ్డ విష‌యంలో క‌ర్క‌శంగా వ్య‌వ‌హ‌రించింది.

కన్న కూతురు అని కూడా చూడకుండా తల్లిదండ్రులు హద్దు మీరారు. కోడలూ అనే విషయం మరచి మేన మామ మరింత కఠినంగా ప్రవర్తించారు.. ప్రేమ పెళ్లి చేసుకున్న ఏడు నెలల తరబడి అక్కసు బయట పడింది.. తమ ఇష్టాన్ని కాదని వేరే యువకుడిని పెళ్లి చేసుకుందని కుమార్తె పట్ల ఆమె తల్లిదండ్రులు కర్కశంగా ప్రవర్తించారు.

కన్నబిడ్డ అనే మమకారాన్ని కూడా మరచి ఆమెను అత్తింటి నుంచి కిడ్నాప్ చేశారు.. తీవ్రంగా కొట్టి కారులో తీసుకెళ్తూ శిరోముండనం చేశారు. రాత్రంగా ఆమె మనుసు మార్చేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో చివరకు వదిలిపెట్టారు. క‌న్న‌వారు ఎన్ని హింసలు పెట్టినా కడకు కట్టుకున్న వాడే కావాలంటూ ఆ యువతి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కింది జగిత్యాలలో కలకలం సృష్టించిన ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు.

జగిత్యాల జిల్లా రూరల్ మండలం బాలపల్లికి చెందిన జక్కుల మధు(23), రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన జువ్వాజి అక్షిత(20) ప్రేమించుకున్నారు. యువతి తల్లిదండ్రులు నిరాకరించడంతో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అక్షిత అత్తవారి ఇంట్లో ఉండగా రెండు కార్లలో వచ్చిన ఆమె కుటుంబ సభ్యులు మధు కుటుంబంపై దాడిచేసి కిడ్నాప్ చేశారు.. కారులో బలవంతంగా తీసుకెళ్తూ వారు యువతిని తీవ్రంగా కొట్టారు.

ఆమె కేకలు వేస్తున్నా వదలకుండా శిరోముండనం చేశారు. జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషషన్‌కు చేరుకున్న యువతి జరిగిన ఘాతుకాన్ని పోలీసులకు వివరించింది.ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్సై అనిల్ న్యాయం చేస్తామని బాధితురాలికి హామీ ఇచ్చారు. యువతిని ఇప్పటికే ఆమె భర్తకు అప్పగించామని, ఆమె తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై నెటిజ‌న్లు ర‌గిలిపోతున్నారు. త‌ల్లిదండ్రుల‌పై పోక్సో చ‌ట్టం కింద కేసులు పెట్టాల‌ని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.