Begin typing your search above and press return to search.
కత్తిని పొగిడేసిన పరిపూర్ణానంద!
By: Tupaki Desk | 13 July 2018 11:32 AM GMTటీవీ ఛానళ్ల సాక్షిగా ఒకరిపై ఒకరు ఘాటు విమర్శలు చేసుకోవటమే కాదు..తమ వాదనలతో పే..ద్ద హడావుడినే సృష్టించారు కత్తి మహేశ్.. పరిపూర్ణానంద స్వామి. మరి.. అలాంటి వారిద్దరి మధ్య ఎప్పుడురాజీ కుదిరిందో కానీ.. వారిద్దరూ తాజాగా ఒకరిపై ఒకరు ప్రశంసించుకుంటున్న వైనం ఇప్పుడు ఆసక్తిగా మారటమే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది. పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఖండించిన కత్తి కొన్ని వ్యాఖ్యలు చేశారు.
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కత్తిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ ఇష్యూలో కత్తిపై హైదరాబాద్ బహిష్కరణ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్నెల్ల పాటు బహిష్కరణ వేటు ఉంటుందని పేర్కొన్నారు. కత్తిపై బహిష్కరణ వేటు వేసిన తర్వాత పరిపూర్ణానంద స్వామిపైనా నగర బహిష్కరణ వేటు వేశారు.
పరిపూర్ణానంద స్వామిపై వేటు వేసిన అంశంపై స్పందించిన కత్తి.. బహిష్కరణ సమస్యకు పరిష్కారం కాదని.. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. మనుషుల్ని తప్పిస్తే సమస్యలు తప్పుతాయన్నది ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వం పయనిస్తే.. అది తిరోగమనమే అవుతుందన్నారు. దీనికి ప్రతిగా పరిపూర్ణానంద స్వామి రియాక్ట్ అవుతూ.. కత్తిని బహిష్కరించటం సరికాదన్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. తాజాగా విజయవాడలో కత్తిపై అనూహ్య రీతిలో ప్రశంసల జల్లు కురిపించారు పరిపూర్ణానందస్వామి. మరింత ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కత్తికి.. పరిపూర్ణానంద మధ్య మాటల యుద్ధానికి కారణమైన రామయాణాన్ని రచించిన వాల్మీకితో కత్తిని పోల్చటం గమనార్హం. కత్తిపై పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే..
+ కత్తి మహేష్ ను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నా. మహేష్ బోయవాడిగా మాట్లాడినా... వాల్మీకిగా మారగల శక్తి ఉన్నవాడు. . భారతీయ సంస్కృతిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. విద్యా వ్యవస్థలో మార్పులు అవసరం. హిందూ సంప్రదాయం - విలువను తెలిపేలా విద్యా వ్యవస్థ ఉండాలి. రామనామ విలువను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.