Begin typing your search above and press return to search.

ద‌క్షిణాది 'యోగి' గా ప‌రిపూర్ణానంద‌?

By:  Tupaki Desk   |   24 Sep 2018 8:30 AM GMT
ద‌క్షిణాది యోగి గా ప‌రిపూర్ణానంద‌?
X
ద‌క్షిణాదిలో పాగా వేయాల‌ని చాలాకాలంగా బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అదే క్ర‌మంలో ఏపీలో టీడీపీతో జ‌త‌కట్టిన క‌మ‌ల‌నాథులు అనుకున్న స్థాయిలో ఫ‌లితాలు రాబ‌ట్ట‌లేక‌పోయారు. త‌మిళ‌నాడులో ఎలాగోలా తంబీల‌ను ఆక‌ట్టుకుందామ‌నుకొని స‌ఫ‌లం కాలేక‌పోయారు. ఇక కేర‌ళ‌లో పూర్తిగా విఫ‌లం కాగా....క‌ర్ణాట‌క‌లో కొంత‌వ‌ర‌కు స‌ఫ‌ల‌మైనా అధికారం ద‌క్కించుకోలేక‌పోయారు. దీంతో, తాజాగా తెలంగాణ‌లో పాగా వేసేందుకు క‌మ‌ల‌నాథులు రెడీ అయ్యార‌ని తెలుస్తోంది. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో బ‌ల‌ప‌డేందుక స్వామి ప‌రిపూర్ణానంద‌ను బ‌రిలోకి దించేందుకు బీజేపీ అధిష్టానం సిద్ధ‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే శుక్ర‌వారం నాడు ఢిల్లీలో అమిత్ షాను ప‌రిపూర్ణానంద క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.

ఆధ్యాత్మిక గురువుగా - హిందూ మ‌త ప్ర‌బోధ‌కుడిగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో యోగి ఆదిత్య‌నాథ్ కు మంచి ఫాలోయింగ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. దాంతో, యోగి యూపీ సీఎంగా ప‌గ్గాలు చేప‌ట్టారు. అదే త‌ర‌హాలో తెలంగాణ యోగిగా ప‌రిపూర్ణానంద‌ను హైలైట్ చేయాల‌ని బీజేపీ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. అందుకే, ప‌రిపూర్ణానంద‌ను ఢిల్లీ పిలిపించుకుని అమిత్ షా భేటీ అయ్యార‌ట‌. గ‌తంలో త‌న‌కు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి రావాల‌నుంద‌ని ప‌రిపూర్ణానంద కూడా చెప్పిన నేప‌థ్యంలో ఈ భేటీ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. అందులోనూ స్వామి ...హైద‌రాబాద్ బ‌హిష్క‌ర‌ణ నేప‌థ్యంలో ...టీఆర్ ఎస్ పై గుర్రుగా ఉన్నారు. దీంతో, స్వామిని నిజామాబాద్ బ‌రిలో దింపాల‌ని షా యోచిస్తున్నార‌ట‌. మ‌రి, ఈ విష‌యంపై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశ‌ముందని తెలుస్తోంది.