Begin typing your search above and press return to search.
కమల్ పై స్వామీజ పంచ్ అదిరిందిగా
By: Tupaki Desk | 4 Nov 2017 5:42 PM GMTరాజకీయ ప్రవేశానికి ఉవ్విళ్లూరుతున్న తమిళ నటుడు కమల్ హాసన్ కొద్దిరోజులుగా వివాదాస్పద చర్యలు, వ్యాఖ్యలతో వార్తల్లో నలుగుతున్నారు. రీసెంటుగా ఆయన హిందూ ఉగ్రవాదం అన్న వ్యాఖ్యలతో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే చాలామంది కమల్ పై మండిపడుతుండగా తాజాగా ఆ లిస్టులో శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద కూడా చేరారు. ఆయన కమల్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల హాసన్ ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పరిపూర్ణానంద స్వామి కమల్ ఉద్దేశాలేమిటన్నవి కూడా చెప్పుకొచ్చారు. హిందువులను విమర్శిస్తే నాయకులు కాలేరని వ్యాఖ్యానించారు. హిందువులు సినిమాలు చూడడం వల్లే కమల్ గొప్పనటుడయ్యాడని అన్నారు. కమల హాసన్ 'ద్రోహి'గా మారాడని పరిపూర్ణానంద మండిపడ్డారు. ఆయన ధర్మ ద్రోహి అయ్యారని అన్నారు.
అంతేకాదు.. కమల్ సినిమాలేవీ హిట్ కాకపోవడంతో ఆయనకు పిచ్చి పట్టిందని కూడా పరిపూర్ణానంద వ్యాఖ్యానించారు. కమల్ లోకనాయకుడు కాదని.. ఆయన లోకల్ నాయకుడిగా కూడా పనికిరారని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే నటులు ఎవరైనా సరే ఎన్టీఆర్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారాు. ఆయన సీఎం అయినా కూడా హిందూ ధర్మాన్ని పాటిస్తూనే అన్ని మతాలనూ గౌరవించారని పరిపూర్ణానంద అన్నారు.