Begin typing your search above and press return to search.
నేను తెలంగాణ సీఎం - పరిపూర్ణానంద!!
By: Tupaki Desk | 3 Nov 2018 1:16 PM GMTబీజేపీలో చేరిన స్వామి పరిపూర్ణానంద తనదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వామి పరిపూర్ణానంద కీలక వ్యాఖ్యాలు చేశారు. హిందుస్థాన్‌లో హిందువులకు స్థానం లేకుండా పోతోందన్నారు. మజ్లీస్ తో జత కలిసిన తెరాస కూటమి - మరో మహా కూటమి కలిసి హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.మహాకూటమి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి యేసు పరిపాలన తెస్తా అంటున్నాడని - ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం యేసు పాలన తెస్తే తాము కూడా మతం మార్చుకోవాలా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ``కేసీఆర్ ఏకంగా నిజాం చరిత్ర గొప్పది అంటున్నారు. తెలంగాణ విమోచన దినం మరిచి.. నిజామే ఇక్కడి చరిత్ర అనడం.. భయం కొల్పుతున్నది`` అని వ్యాఖ్యానించారు.
వరంగల్ లో ఒక ఉన్మాది మసీదులలో తర్ఫీదు పొందిన వ్యక్తి 70 ఏళ్ల వృద్ధ బ్రాహ్మణుని కొట్టి చంపాడని పరిపూర్ణానంద ఆవేదన వ్యక్తం చేశారు. ``సుప్రభాతం పెడితే తన మానసిక స్థితి పాడైందని దాడి చేసిన వ్యక్తి చెప్పడం దారుణం. రోజుకు 5 సార్లు హజా చేస్తే మేము ముస్లింల విని భక్తి అనుకోవాలి..కానీ.. సుప్రభాతం ఇబ్బంది పెట్టిందా? ఒక పూజరిని మతోన్మాది చంపితే కనీసం సరిగా వైద్యం ఇవ్వని చేతకాని దద్దమ్మ ప్రభుత్వం ఇది. పోలీసులు దర్యాప్తు జరిపి ఆకతాయి అనడం ఏమిటి?అంటే మసీదులు - మదర్సాలో ఉండేవారు ఆకతాయిలా చెప్పండి? `అంతిమ సంస్కారాలకు కూడా వెళ్ళడం కూడా కష్టమైంది. కత్తులు - తుపాకులు - నోట్ల కట్టలు పెట్టె వారిని కూడా వదిలేస్తారు కానీ మాకు ఆంక్షలు..నేను హిందూ దేశంలో.. ఒక పూజారి.. అంత్యక్రియలకు హాజరు కావొద్దా? హిందూ పూజారి చచ్చిపోతే.. తెరాస, కాంగ్రెస్.. నుండి ఒక్కరు కూడా హాజరు కాలేదు. రేపు ఇంట్లో పూజలు చేస్తే దూరి చంపితే ఎవరు దిక్కు? ఇతర మతస్థుడు చనిపోతే ఇతర మత పెద్దలు.. వెళ్తే ఇన్ని ఆంక్షలు... పెట్టె వారా?`` అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మైనార్టీల కోసం కాకుండా...మెజారిటీల రక్షణ కోసం చట్టం తేవాలని పోరాటం చేసే పరిస్థితి వచ్చిందని పరిపూర్ణానంద పేర్కొన్నారు. తెరాస దారుసాలం కనుసన్నల్లోనే నడుస్తోందని ఆయన ఆరోపించారు. `` ఒకరేమో రజాకార్ పాలన కోసం.. ఒకరేమో జీసస్ పాలన కోసం పోరాటం చేస్తున్నారు. మహాకూటమి కూడా ఒకప్పుడు మజ్లీస్ చేతుల్లో రాజాకార్ ప్రభుత్వం నడిచింది. మళ్ళీ అవే ప్రభుత్వాలు కావాలా? ఇప్పుడు దారుసాలం కనుసన్నల్లో కాదు.. లాల్ దర్వాజ కనుసన్నల్లోనే ప్రభుత్వం నడవాలి` అని ఆయన అన్నారు..
ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించడం బీసీల పొట్ట కొట్టడం కాదా అని పరిపూర్ణానంద ప్రశ్నించారు. ``హిందువులకు అన్యాయం జరిగినప్పుడు ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ ఏం చేస్తోంది అంటారు. అందుకే మేం హిందువుల తరఫున మాట్లాడుతున్నాను. హిందువులు డిసెంబర్7న విజ్ఞతతో ఓటు వెయ్యాలి లేదంటే ఐదేళ్లు ఏడవాల్సి వస్తుంది` అని వ్యాఖ్యానించారు. ``ధర్మం కోసం పోరాటం చెయ్యడానికి.. బీజేపీ ఒక వేదిక. బీజేపీ మాత్రమే ఎంబీసీ అయిన నరేంద్ర మోడీని దేశానికి ఇచ్చింది. దేశాన్ని ప్రేమించే అబ్దుల్ కలాంను రాష్ట్రపతిని చేసింది`` అని అన్నారు. తాను సీఎం అభ్యర్థినని ప్రకటించడంపై పరిపూర్ణానంద స్పందించారు. `ఔను. నేను ఈ రాష్ట్రానికి సీఎంనే. నేను రాష్ట్రానికి కామన్ మాన్ ఆఫ్ థి స్టేట్.`` అని పరిపూర్ణానంద పేర్కొన్నారు.