Begin typing your search above and press return to search.

అటూ..ఇటూ కానీ పరిపూర్ణానంద..ఒరిగిందేటీ?

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:23 AM GMT
అటూ..ఇటూ కానీ పరిపూర్ణానంద..ఒరిగిందేటీ?
X
2018 తెలంగాణ అసెంబ్లీ బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా వ్యవహరించిన పరిపూర్ణానంద ఫలితాల అనంతరం ఏం చేయబోతున్నారని ఆసక్తిని రేపుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి చూస్తుంటే తెలంగాణ ఆ పార్టీ ఉన్నా ఒక విధంగా లేనట్టే. ఈ పరిస్థితుల్లో బీజేపీ స్టార్ క్యాంపెనర్ గా చెప్పుకున్న పూరిపూర్ణానంద రాజకీయాల్లో కొనసాగుతారా లేదా తిరిగి తాను నమ్ముకొన్న ఆధ్యాత్మికం వైపు వెళుతారా అనే చర్చ సాగుతుంది.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ తో పోలిస్తే తనకేం తక్కువ అనుకున్నారే ఏమోగానీ పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరారు. ఆ వెంటనే అందరి కంటే తాను ఉన్నతం అన్నట్లు వ్యవహరించడం ప్రారంభించారు. ఏకంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పక్కనే కుర్చీ వేసుకొని పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. 30రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తానని అమిత్ షాకు మాటిచ్చానని పరిపూర్ణనంద పదేపదే చెప్పుకునేవారు.

పరిపూర్ణనంద కాన్ఫిడెన్స్ ను చూసి బీజేపీ నేతలే బిత్తరపోయేవారు. తానే నెక్ట్స్ సీఎం అన్నంతగా ఆయన హడావుడి కనిపించేది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే లాంటి వాళ్లకు ఇచ్చిన ఇంటర్వూల్లో కూడా ఆయన 30రోజుల్లో బీజేపీకి 70 సీట్లు సాధించి పెడతానని సవాల్ చేశారు. ఎన్నికలు జరిగినంత కాలం ఆయన తెలంగాణలో విస్తృతంగా పర్యటించారు.

తీరా ఎన్నికల ఫలితాలు చూస్తే అసలు బీజేపీ తెలంగాణలో ఉందా అనే రీతిలో ప్రజలు ఆ పార్టీకి తీర్పునిచ్చారు. 118 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తే ఒక గోషామహాల్ మినహా ఎక్కడా పోటీ ఇచ్చినా దాఖలాలు కూడా కనిపించలేదు. బీజేపీ వంద సీట్లలో డిపాజిట్లు గల్లంతయ్యాయి. పరిపూర్ణనంద విస్తృతంగా పర్యటించినా బీజేపీకి సీట్లు పెరిగిందేమీ లేకపోగా ఘోరంగా కోతపడింది.

తెలంగాణలో బీజేపీకి కొంతమేరకైనా బలం ఉందని పార్టీ అగ్రనాయకత్వం ఆశపడింది. తెలంగాణలో ఆరెస్సెస్ లాంటి హిందూ సంస్థలు కిందిస్థాయిలో ఉండటం తమకు కలిసి వస్తుందని ఆశించినా ఫలితం రాలేదు. దీంతో ఇప్పుడు పరిపూర్ణానంద సైలెంట్ అయ్యారు. మరీ ఇప్పటికీ పూరిపూర్ణానందకు రాజకీయాలు బోధపడ్డాయా.. లేదా నాకేందుకు కొచ్చిందీ తంటా అని మళ్లీ తాను నమ్ముకొన్న ఆధ్యాత్మిక ప్రవచనాలు వళ్లిస్తూ ఉంటారో చూడాలి మరీ..