Begin typing your search above and press return to search.
జనవరి 1న న్యూయియర్ వద్దంటున్న యోగి
By: Tupaki Desk | 26 Dec 2017 6:28 PM GMTఆంగ్ల నూతన సంవత్సరాది జనవరి 1న ఆలయాల్లో ప్రత్యేకంగా హడావుడి ఏమీ చేయొద్దని ఏపీ దేవాదాయ శాఖ ఇప్పటికే ఆదేశాలిచ్చింది.. బీజేపీ శ్రేణులు కూడా దీన్ని భుజానికెత్తుకుంటున్నాయి. వారికి మరో గళం ఇప్పుడు తోడయింది. హిందూ ధర్మానికి మద్దతుగా నిత్యం మాట్లాడే స్వామి పరిపూర్ణానంద స్వామి కూడా వారికి తోడయ్యారు. గ్రెగేరియన్ క్యాలెండర్ కాలమానం ప్రకారం జరుపుకొనే ఆంగ్ల సంవత్సరం ఎంతవరకు మన భారతీయులకు ప్రామాణికం? అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం మన సంప్రదాయం కాదని అన్నారు. రుషులు అందించిన పంచాంగం.. ఖగోళ గ్రహగతులు, ఋతువులు, మరెన్నో సూక్ష్మ గణితముల ఆధారంగా నిర్ధిష్టంగా నిర్ణయించినవని తెలిపారు. దీని ప్రకారం మనకు యుగ ఆదిని ఉగాది రోజుగా నిర్ణయించారని, అదే అసలైన కొత్త సంవత్సరం అని అన్నారు. ‘‘ఓ భారతీయుడా మేలుకో! ప్రకృతి విరుద్ధ పండుగలకు స్వస్తి చెబుదాం.. ప్రకృతితో మమేకమైన ఉగాదితోనే ముందుకు సాగుదాం'’ అని పరిపూర్ణానంద పిలుపునిచ్చారు.
జనవరి 1కి బదులు ఉగాదిని ప్రోత్సహిస్తే మన తెలుగుని చాటి చెప్పినట్లే అవుతుందని అన్నారు. భారతీయ విధానం ప్రపంచ దేశాల కంటే ప్రత్యేకమైన విధానమని అన్నారు. ‘‘సైన్సు అభివృద్ధి చెందక ముందే చంద్ర - సూర్య గ్రహణాల గురించి మనవారు రాసిపెట్టారు. ప్రపంచ దేశాలు ఇప్పటికీ మన పూర్వీకులు వాటిని ఎలా లెక్కకట్టారో తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. ఆంగ్లేయుల క్యాలెండర్ ని అనుసరించక తప్పదు, కాకపోతే జనవరి 1 మాత్రమే నూతన సంవత్సరం అంటూ అందరిపైనా రుద్దడం సరికాదు' అని పరిపూర్ణానంద తెలిపారు.
మరోవైపు ఇప్పటికే దేవాదాయ శాఖ ఆదేశాలను చాలామంది స్వాగతిస్తుండగా తాజాగా మంచి ప్రజాదరణ ఉన్న స్వామి పరిపూర్ణానంద కూడా అందుకు మద్దతుగా మాట్లాడుతుండడంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకల ఉత్సాహం తగ్గొచ్చని భావిస్తున్నారు.