Begin typing your search above and press return to search.
పరిపూర్ణానందకు పొగబెడ్తున్న బీజేపీ నేత ఎవరంటే!
By: Tupaki Desk | 12 Nov 2018 9:41 AM GMTభారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖలో కొత్త కలకలం మొదలైంది. ఓ వైపు క్షేత్రస్థాయిలో బలోపేతం ఆ పార్టీ పెద్దలు ఆశించిన స్థాయిలో జరగనప్పటికీ - పార్టీ పుంజుకోనప్పటికీ - అదే సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్న అంశంపై నాయకుల మధ్య విబేధాలు నెలకొన్నాయని ప్రచారం జరుగుతోంది. పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరిన తర్వాత ముఖ్య మంత్రి సీటుపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నది. రాష్ట్ర బీజేపీలో కీలక భూమిక పోషించడం కోసమే పరిపూర్ణానంద స్వామిని ఆ పార్టీలో చేరేలా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ ఎస్ ఎస్) ప్రోత్సహించినట్టు సమాచారం. రాష్ట్ర బీజేపీ నాయకులను కాదని - ఏకంగా అమిత్ షా సమక్షంలో చేరడ మే ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ తరహాలో తెలంగాణలోనూ స్వామీజీకి బాధ్యతలు అప్పగిస్తారా?అన్న అనుమానాలు కమలంలో చోటుచేసుకుంటున్నాయి.
తెలంగాణకు నేను సీఎం అని పేర్కొన్న పరిపూర్ణానంద తాను కామన్ మ్యాన్ అని పేర్కొన్నారు. పరిపూర్ణానంద స్వామి బీజేపీలో చేరిన తీరును జీర్ణించుకోలేని నేతలు తెలంగాణలో యోగి నేనే...సీఎంను అంటూ ఆయన ప్రచారం చేసుకుంటున్న తీరును బీజేపీలోని కొందరు నేతలు జీర్ణించుకోవడం లేదని తెలుస్తోంది. తమ అనుచరుల వద్ద ఈ సంగతిని ప్రస్తావిస్తున్నారు. పార్టీలో ఉన్న తమ స్థాయిని ఏ మాత్రం తగ్గించుకోకుండా పావులు కదుపుతున్నారు. పరిపూర్ణానంద స్వామి చేరడంతో తెలంగాణ యోగిగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో బీజేపీ సీనియర్లలో అసంతృప్తి బయటపడింది. ముఖ్యమంత్రి సీటుపై సీనియర్లలో పలువురు నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తామే ముందు వరుసలో ఉంటామనీ - ఢిల్లీ పెద్దలు అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి సమావేశాలు - సభలు బీజేపీ రాష్ట్ర నాయకుల అనుమతి లేకుండానే ఇష్టమొచ్చినట్టుగా నిర్వహిస్తున్నారని పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో బీజేపీలో సీఎం రేసులో ఉన్న నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలతో బీజేపీ రాష్ట్ర నాయకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేసులో ఉన్న వారు ఆచితూచి అడుగులేస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసేందుకు తాము ఇంతకాలం అహర్నిశలు కష్టపడ్డామనీ - కొత్తగా వచ్చిన వారికి ముఖ్యమైన పదవులు ఇవ్వకూడదనీ ఢిల్లీ పెద్ద ల దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. ఈ విషయంలో ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలను బట్టి పావులు కదుపుతున్నారు. అయితే ఢిల్లీ పెద్దల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకుంటూనే ముఖ్యమంత్రి రేసులో ఇంకొకరు ముందు వరుసలో ఉండకుండా జాగ్రత్త పడుతున్నారు. కాగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా వ్యవహరించిన సీనియర్ నేత ఒకరు పరిపూర్ణానంద తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్లు సమాచారం.