Begin typing your search above and press return to search.

ఐల‌య్య మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేదే!

By:  Tupaki Desk   |   3 Oct 2017 10:32 AM GMT
ఐల‌య్య మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేదే!
X
వివాదాస్ప‌ద ర‌చ‌యిత‌ - ప్రొఫెస‌ర్ కంచె ఐల‌య్య‌పై శ్రీపీఠం అధిప‌తి స్వామి ప‌రిపూర్ణానంద రెచ్చిపోయారు. ఇప్ప‌టికే ప‌లు ఛానెళ్లు - వేదిక‌ల‌పై ఐల‌య్య‌ను ఏకేసిన స్వామి మ‌రోసారి మ‌రింత గ‌ట్టిగా రెచ్చిపోయారు. ఐల‌య్య రాసిన సామాజిక స్మ‌గ్ల‌ర్లు కోమ‌టోళ్లు పుస్త‌కం తెలుగు రాష్ట్రాల్లో మంట‌లు రేపిన విష‌యం తెలిసిందే. ఆర్య‌వైశ్యులు.. త‌మ‌ను ఐల‌య్య కించ‌ప‌రిచాడ‌ని ఆగ్ర‌హిస్తూ.. రోడ్ల‌మీదెక్కి ఆందోళ‌న‌ల‌కు దిగారు. ప‌లు న‌గ‌రాల్లో భారీ ఎత్తున ధ‌ర్నాలు చేశారు. ఆర్య వైఖ్య మ‌హిళ‌లు సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చి ఐల‌య్య‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు.

ఇక‌, అప్ప‌ట్లోనే ఈ విష‌యంల క‌లుగ జేసుకున్న ప‌రిపూర్ణానంద స్వామి.. ఐల‌య్య పుస్త‌కాన్ని ఖండించారు. ఇలాంటి వాటిని రాసి హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీస్తారా అంటూ పెద్ద పెట్టున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ ప‌రంప‌ర‌లోనే తాజాగా నిన్న పశ్చిమగోదావ‌రికి వ‌చ్చిన ప‌రిపూర్ణానంద మ‌రోసారి ఐల‌య్య విష‌యంపై మీడియాతో మాట్లాడారు. అన్యమతస్తుడైన కంచ ఐలయ్య హిందువులపై వివాదాస్పద పుస్తకం రాశారని, దీనిపై తాము నిలదీయడంతో బెంగళూరులోని అజ్ఞాత ప్రాంతానికి వెళ్లిపోయారని విమర్శించారు.

తాను చేసిన త‌ప్పుకు స‌మాధానం చెప్పుకోలేక‌.. స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతుంటే ఐల‌య్య బెంగ‌ళూరుకు వెళ్లి త‌ల‌దాచుకున్నార‌ని, అలాంటి వ్య‌క్తి.. త‌న‌కు హిందువుల నుంచి ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెప్ప‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని స్వామి ఎద్దేవా చేశారు. అన్య‌మ‌స్తులు ఎవ‌రూ హిందువులు - హిందూ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా పుస్త‌కాలు రాయొద్ద‌ని, అలా రాస్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర‌వుతాయ‌ని హెచ్చ‌రించారు. హిందూ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచే హ‌క్కు ఎవ‌రికీ లేద‌న్నారు.

తాను నీతి - నిజాయితీ - నిబద్ధతలను విడనాడి కొన్ని శక్తులకు అమ్ముడుపోయానని కంచ ఐలయ్య స్వయంగా చెబుతున్నారని దీనీలోని ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తాను నిర్వహిస్తున్న సర్వజన సంఘటన్‌ ద్వారా ఇప్పటికే తాము 267 గ్రామాలను దత్తత తీసుకున్నామన్నారు. స‌మాజ సేవ కోసం శ్రీపీఠం అంకిత‌మైంద‌ని, ఏ వ‌ర్గం వారినీ, ఏ మతం వారినీ కించ‌ప‌రిచే ప‌ని - పుస్త‌కాలు రాసే ప‌ని తాము చేయ‌బోమ‌ని స్వామి వివ‌రించారు. మొత్తానికి ఈ ప‌రిణామంతో ఐల‌య్య ఘ‌ట‌న ఇంకా చ‌ల్లార‌లేద‌ని తెలుస్తోంది.