Begin typing your search above and press return to search.

పరిటాల శ్రీరామ్ పారిపోయాడా.?

By:  Tupaki Desk   |   24 Aug 2020 6:00 PM IST
పరిటాల శ్రీరామ్ పారిపోయాడా.?
X
అనంతపురం అంటే పరిటాల.. పరిటాల అంటే అనంతపురం.. అన్న రేంజ్ లో ఆ జిల్లాలో రాజకీయం నడిపించారు పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో పరిటాల రాజకీయ వారసుడు అయిన పరిటాల శ్రీరామ్ దారుణంగా ఓడిపోయాక ఎక్కడా కనిపించడం లేదు అంట..

పరిటాల కుటుంబం అంతా ధైర్యానికి మారుపేరు.. వాళ్ల నాన్న.. పెద్దనాన్న.. వాళ్ల తాత ప్రజల కోసం నాయకత్వం వహించి ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడారు అంటారు. కానీ పరిటాల శ్రీరామ్ 2018లో నమోదైన ఒక కేసులో ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని హైదరాబాద్, బెంగళూరులో ఉంటూ అందుబాటులో లేకుండా పోయాడట..కనీసం క్యాడర్ కు కూడా కనపడకుండా పారిపోయాడని అనంతపురంలో అంతా చెవులు కొరుక్కుంటున్నారు.

పరిటాల శ్రీరామ్ ఎంత పిరికివాడో దీన్ని బట్టి తెలుస్తోందని అంటున్నారు. పరిటాల వారసాత్వంకు సరిపోడు అని.. భయస్తుడు అని అందుకే ధైర్యంగా నిలబడలేకపోతున్నాడని అందరూ అనుకుంటున్నారు. పరిటాల శ్రీరామ్ అజ్ఞాతవాసంపైనే ఇప్పుడక్కడ జోరుగా చర్చ జరుగుతోంది.