Begin typing your search above and press return to search.

శ్రీరామ్.. పరిటాల రాజకీయ వారసత్వాన్ని అందుకుంటారా?

By:  Tupaki Desk   |   8 April 2019 5:42 AM GMT
శ్రీరామ్.. పరిటాల రాజకీయ వారసత్వాన్ని అందుకుంటారా?
X
అసలే తెలుగుదేశం పార్టీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉంది. ఇలాంటి సమయంలో కొత్త వాళ్లు రంగంలోకి దిగడం అంత తేలిక అయిన విషయం కాదు. ప్రత్యేకించి ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీ రాజకీయ వారసులు ప్రత్యక్ష ఎన్నికల రంగంలోకి దిగడానికి తగినవి కావు.. అనే విశ్లేషణలు మొదటి నుంచి ఉన్నాయి. లోకేష్ కు అంటే తప్పదు - జేసీ వారసులకు అంటే వయసు చాలా వచ్చే సింది. వారు దిగినా ఒక లెక్క కానీ.. పరిటాల శ్రీరామ్ కు అంత తొందర ఏమొచ్చింది? అనేది కొంతమంది రైజ్ చేసిన కొశ్చన్.

మరో సారి పోటీ చేయడానికి పరిటాల సునీతకు వయసు ఉంది, ముందు ముందు శ్రీరామ్ కూ అవకాశాలుంటాయి. అయినా ఆయన రంగంలోకి దిగడం విడ్డూరంగా ఉందనే అభిప్రాయాలు వినిపించాయి. ఎలాగైతేనేం.. ఆయనే పోటీ చేశాడు. ప్రచారం కూడా చేసుకొంటూ ఉన్నాడు.

అయితే శ్రీరామ్ కు బలమైన ప్రత్యర్థి ఎదురుగా ఉన్నాడు. వరసగా మూడో సారి తోపుదుర్తి వాళ్లు పరిటాల కుటుంబం మీద పోటీకి దిగారు. ప్రతి సారీ వీరికి విజయం త్రుటిలో మిస్ అవుతూ ఉంది. ఈ మేరకు తోపుదుర్తి కుటుంబం మీద ఒక రకమైన సానుభూతి కూడా ఉంది నియోజకవర్గంలో.

ప్రత్యేకించి బీసీల్లో మార్పు కనిపిస్తూ ఉంది. పరిటాల వర్గంలో ఉండిన పలువురు బీసీ నేతలు వారికి దూరం అయ్యారు. దానికి అనేక కారణాలున్నాయి. ఇక గత ఎన్నికల సమయంలో ఉన్నట్టుగా తెలుగుదేశం అనుకూల గాలి లేదు. అప్పుడు రుణమాఫీ హామీ తెలుగుదేశానికి బాగా హెల్ప్ చేసింది. ఇప్పుడు అలాంటి హామీల ప్రభావం లేదు! ఇది అనంతపురం వంటి జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులందరికీ ఇబ్బందికరమైన పరిణామం అవుతోంది. దీనికి రాప్తాడు కూడా అతీతం కాదు!

-చేజారిన అనుచరవర్గం
-దశాబ్దాలుగా ఒకే కుటుంబం ఆధిపత్యం అనే భావన
-ప్రభుత్వ వ్యతిరేకత
-పరిటాల శ్రీరామ్ కు అనుభవ లేమి అనే ప్రచారం

ఇవన్నీ రాప్తాడులో శ్రీరామ్ కు నెగిటివ్ పాయింట్లు. కొన్ని పాజిటివ్ పాయింట్లు ఉన్నాయి.

-సునీత పై వ్యతిరేకత తీవ్రంగా ఉంది, శ్రీరామ్ రంగంలోకి దిగడంతో అది కొంచెం తగ్గి ఉండవచ్చు

-ఆర్థిక బలం విషయంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వెనుకడ్డారు. ఈ విషయంలో పరిటాలకు తిరుగేలేదు!

ఇవి రాప్తాడు నియోజకవర్గంలో పరిస్థితులు. గత ఎన్నికల్లో గెలిచింది మరీ భారీ మెజారిటీ కాదు. ఈ సారి పరిణామాలు మారాయి, వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో గెలుపు నల్లేరు మీద నడక అయితే కాదు.

రాప్తాడు నియోజకవర్గంలో తమ పార్టీ గెలుస్తుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చాలా విశ్వాసంతో కనిపిస్తున్నాయి కూడా!