Begin typing your search above and press return to search.
సునీత..ఎర్రబెల్లి ఎదురుపడినప్పుడు ఏమైంది?
By: Tupaki Desk | 17 March 2016 9:25 AM GMTపరిటాల సునీత.. ఎర్రబెల్లి దయాకర్ రావులు ఇద్దరూ ఎదురుపడ్డారు. దీన్లో విశేషం ఏమీ ఉందంటారా? అక్కడికే వస్తున్నాం. ఒకప్పుడు ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన వారు. ఇద్దరూ పార్టీలో కీలక నేతలే. అలాంటి ఇద్దరు నేతలు.. రాష్ట్ర విభజన కారణంగా.. ఒకే పార్టీ అయినప్పటికీ వేర్వేరు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా ఎర్రబెల్లి సైకిల్ దిగేసి కారు ఎక్కేయటంతో ఇద్దరు వేర్వేరు పార్టీలకు చెందిన నేతలుగా మారిపోయారు.
ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న ఈ సీనియర్ నేతలు.. ఇప్పుడు కత్తులు నూరుకునే పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ ఇద్దరు నేతలు అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఎదురెదురు పడ్డారు. ఈ సందర్భంగా వారు ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు.
ఎర్రబెల్లిని ఉద్దేశించిన సునీత.. అన్నా.. మీరుపార్టీ మారకుంటే బాగుండేదని అనగా.. దీనికి స్పందించిన ఎర్రబెల్లి.. ఏపీలో చంద్రబాబు.. తెలంగాణలో తాము సుస్థిరంగా ఉండాలని వ్యాఖ్యానించినట్లు చెబుతున్నారు. నిన్నటి వరకూ ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు సీనియర్ నేతలు ఇప్పుడు వేర్వేరుపార్టీలు.. వారి వాదనల్ని వినిపించటం చూసినప్పుడు కాలమహిమ అనకుండా ఉండలేం.