Begin typing your search above and press return to search.
మంత్రి గారు ‘డిక్టేటర్’ చూశారు
By: Tupaki Desk | 18 Jan 2016 9:34 AM GMTఢిల్లీకి రాజైనా.. తెలుగులో ఓ సామెత ఉంటుంది. అలాగే మంత్రి పదవిలో ఉన్నా సినిమాల మీద ఆసక్తి చూపే రాజకీయ నాయకులుంటారు. అలాంటి వాళ్లలో పరిటాల సునీత ఒకరు. ఆమె అప్పుడప్పుడూ కుటుంబ సమేతంగా సినిమాలు చూస్తుంటారు. ముఖ్యంగా బాలయ్య సినిమాల్ని ఆమె తప్పకుండా చూస్తారు. సంక్రాంతికి విడుదలైన నందమూరి హీరో కొత్త సినిమా ‘డిక్టేటర్’ను కూడా ఆమె కుటుంబ సమేతంగా, అభిమానులతో కలిసి చూశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాల మంత్రిగా ఉన్న సునీత.. ఆదివారం అనంతపురంలోని ఓ థియేటర్లో ‘డిక్టేటర్’ సినిమా చూశారు.
మంత్రితో పాటు ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ - బాలయ్య వీరాభిమాని జగన్ లతో పాటు పెద్ద ఎత్తున బాలయ్య అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ షోకు విచ్చేశారు. దీంతో థియేటర్ బాలయ్య అభిమానుల సందడితో హోరెత్తింది. అనంతపురం జిల్లా అంతటా కూడా ‘డిక్టేటర్’ హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తోంది. ఇక్కడ బాలయ్యకు భీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. బాలయ్య సొంత నియోజకవర్గం హిందూపురంలో కూడా ‘డిక్టేటర్’ ఇరగాడేస్తోంది. మరోవైపు బాలయ్య కూడా తిరుపతితో పాటు చంద్రబాబు పుట్టిన ఊరు నారావారి పల్లెలో అభిమానులతో కలిసి ‘డిక్టేటర్’ షో చూడటం విశేషం.