Begin typing your search above and press return to search.
పరిటాల సునీతను రెచ్చగొడుతున్న జేసీ సోదరులు!
By: Tupaki Desk | 9 March 2019 10:30 AM GMTముందొచ్చిన చెవుల కన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అని.. సామెత. బహుశా తెలుగుదేశం పార్టీ అనంతపుర విభాగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇలానే ఉన్నాయి. ఈ విషయాన్ని చెప్పుకునే చంద్రబాబును నిష్టూరం ఆడుతున్నారట మంత్రి పరిటాల సునీత. దశాబ్దాల తరబడి పార్టీ కోసం పని చేసింది తాము, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇస్తున్నది మాత్రం నిన్నలా మొన్న పార్టీలోకి వచ్చిన వారికి అని ఆమె అంటున్నారట.
ఇంతకీ అసలు కథ ఏమిటంటే.. ఈ సారి ఎన్నికల్లో తన తనయుడు పరిటాల శ్రీరామ్ ను బరిలోకి దించాలని సునీత భావించారు. ఇప్పుడు కాదు.. మూడు నాలుగేళ్ల నుంచినే ఈ ప్రయత్నంలో ఉన్నారామె. అందు కోసం.. వివిధ నియోజకవర్గాల పేర్లను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు.
ముందుగా అనంతపురం అర్బన్ అసెంబ్లీ అనుకున్నారు. అది కుదరదని బాబు అన్నారు. ప్రభాకర్ చౌదరితో అక్కడ పరిటాల వర్గం పేచీ పెట్టుకోగా.. బాబు వారించారు. ఆ తర్వాత ధర్మవరం అసెంబ్లీ టికెట్ కోరారు. అయితే అక్కడా సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ కమ్మ నేత వరదాపురం సూరి ఉండటంతో.. బాబు అక్కడ కూడా ఛాన్స్ లేదని చెప్పేశారు.
పెనుకొండ అనుకున్నారు కానీ.. అక్కడ బీసీ నేత ఉన్నారు. ఆయనను పక్కన పెడితే టీడీపీ షేక్ అవుతుంది. అందుకే సునీతే ఆ విషయంలో డ్రాప్ అయ్యారు. ఇక హిందూపురం ఎంపీ టికెట్ కోరారు. అక్కడ నుంచి సిట్టింగ్ ఉన్న కిష్టప్ప త్యాగానికి సిద్ధమే కానీ.. ఆయన తనకు అసెంబ్లీ టికెట్ కావాలని అన్నారట. అది సర్దలేక.. చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని పరిటాల కుటుంబానికి సర్ధి చెప్పినట్టుగా సమాచారం.
అయితే బాబు అలా సర్ధి చెప్పినా మరో రకంగా దొరికిపోయారు. జేసీ కుటుంబానికి రెండు టికెట్లు కేటాయించారు చంద్రబాబు. అవి వారి సిట్టింగ్ స్థానాలే అయినా.. వారి వారసులకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు. అనంతపురం నుంచి జేసీ పవన్ - తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ లు పోటీ చేస్తున్నారు. ఇలా ఒకేసారి జేసీ వారసులు ఇద్దరికీ ఛాన్స్ ఇవ్వడంతో.. పరిటాల సునీత అగ్గిమీ గుగ్గిలం అవుతున్నారట.
తాము టికెట్ అడిగితే.. వారసుడికి ఛాన్స్ లేదు - ఒక్కోరికి ఒక్కోటే అన్నారు.. దశాబ్దాల పాటు తెలుగుదేశం కార్యకర్తలను వేధించిన జేసీ కుటుంబానికి మాత్రం రెండు టికెట్లా.. అని ఆమె బాబును నిలదీసినంత పని చేస్తున్నారట.
ఇప్పటికీ పరిస్థితి చేయి దాటిపోలేదని.. తన తనయుడు శ్రీరామ్ కు కనీసం కల్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని చంద్రబాబును కోరుతున్నారట ఆమె. ఆ నియోజకవర్గంలో హనుమత రాయ చౌదరిపై వ్యతిరేకత నేపథ్యంలో ఆయనను మార్చాలని బాబు భావిస్తున్నారు. ఇప్పుడు సునీత ఆ సీటు విషయంలో పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి బాబు ఇప్పుడేం తేలుస్తారో! మొత్తానికి తనయుడికి టికెట్ దక్కదని ఫిక్సయిన సునీతను జేసీ సోదరుల వారసులు రంగంలోకి దిగి మరింత అసహనానికి గురి చేస్తున్నట్టున్నారు.