Begin typing your search above and press return to search.
ప్రమాదంలో పరిటాల సునీత అల్లుడు మృతి
By: Tupaki Desk | 4 Aug 2016 4:58 AM GMTరైలు ఢీకొన్న సంఘటనలో ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అల్లుడుతో సహ మరో ఇంజనీర్ మృతిచెందారు. బుధవారం రాత్రి అనంతపురం జిల్లాలోని ప్రసన్నాయపల్లి దగ్గర ఈ సంఘటన జరిగింది. మృతిచెందిన వారిలో ఒకరు రిలయన్స్ ఇంజినీర్ కాగా... మరొకరు మంత్రి పరిటాల సునీత అల్లుడు గిరిగా గుర్తించారు. రైల్వే పోలీసుల కథనం ప్రకారం రాప్తాడు మండలంలోని ప్రసన్నాయునిపల్లి రైల్వే ట్రాక్ వద్ద ఈ సంఘటన జరిగింది.
ట్రాక్ పక్కనే రిలయన్స్ 4జీ టవర్ ఉంది. బుధవారం రాత్రి 7 గంటలు దాటాక గిరీష్ నాయుడు సైట్ కోఆర్డినేటర్ (ఎస్ సీవో) - ఫైబర్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అరవిందకుమార్ రూట్ సర్వే కోసం రైల్ ట్రాక్ పైకి వెళ్లారు. రిలయన్స్ కేబుల్ రైల్వే లైన్ మీదుగా వెళ్లాల్సి ఉంది. దీంతో రైల్వేశాఖ అనుమతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే ఐరన్ బ్రిడ్జిపై వీరు ఎల్ సీ నెంబర్లు నోట్ చేసుకుంటున్నారు. ఈ టైంలో వస్తున్న రైలును వీరు గమనించకపోవడంతో రైలు ప్రమాదవశాత్తు వీరిని ఢీకొంది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
రిలయన్స్ సిబ్బంది వీరికి ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనుమానం వచ్చిన వారు గాలిస్తుండగా గురువారం తెల్లవారు జామున ఐరన్ బ్రిడ్జి వద్ద వారి మృతదేహాలు కనిపించాయి. వీరిలో ఇంజనీర్ అజయ్ కుమార్ స్వస్థలం గుంటూరు జిల్లా. గిరిశేఖర్ నాయుడు మంత్రి సునీతకు వరుసకు అల్లుడు అవుతాడు. సంఘటనా స్థలాన్ని మంత్రి సోదరులు బాలాజీ - ధర్మవరం మురళి పరిశీలించారు.