Begin typing your search above and press return to search.
టీడీపీకి పవన్ మద్దతివ్వాలట!
By: Tupaki Desk | 4 Jun 2018 6:45 AM GMTరాజకీయాలలో శాశ్వత శత్రువులు.....శాశ్వత మిత్రులు ఉండరన్న సంగతి తెలిసిందే. వీరావేశంలో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్న వ్యక్తులు కూడా ఆ తర్వాత పాలు నీళ్లలాగా కలిసిపోయిన సందర్భాలు అనేకం. ఒక పార్టీని విమర్శించి ....తిరిగి అదేపార్టీలో చేరి చక్రం తిప్పిన నేతలూ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి టీడీపీపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ఏపీలో అవినీతి పెరిగిపోయిందని, పాలన కుంటుపడిందని పవన్ ఆరోపిస్తున్నారు. తాజాగా, విజయనగరం పర్యటనలో ఉన్న పవన్...చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ క వెన్నుపోటు పొడిచి పార్టీని చేజిక్కించుకున్న చంద్రబాబు తన పార్టీని విమర్శించడం ఏమిటని పవన్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ మంత్రి పరిటాల సునీత ...పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి పవన్ మద్దతివ్వడం అన్ని విధాలా మంచిదని - దాని వల్ల అందరికీ మంచి జరుగుతుందని సునీత అభిప్రాయపడ్డారు.
కొద్ది నెలల క్రితం అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్ ....అక్కడి సమస్యల గురించి సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సునీత ఇంటికి వెళ్లిన పవన్ అక్కడ విందు భోజనం కూడా చేశారు. ఈ సందర్భంగా....పరిటాల రవికి - పవన్ కు మధ్య గొడవేలేదని ఇరు పక్షాలు క్లారిటీ కూడా ఇచ్చాయి. అయితే, ఆ తర్వాత టీడీపీపై పవన్ విమర్శలు గుప్పించడంతో టీడీపీ నేతలు యూటర్న్ తీసుకొని పవన్ పై విమర్శలు గుప్పించారు. సునీత కూడ పవన్ ను విమర్శించారు. ఈ నేపథ్యంలో మళ్లీ పవన్ పై సునీత పాజిటివ్ కామెంట్స్ చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. టీడీపీతో పవన్ పయనిస్తే రాష్ట్రానికి మంచిదని - రాష్ట్రాభివృద్ధి కోసం ప్రభుత్వానికి పవన్ సలహాలు - సూచనలు ఇవ్వాలని సునీత కోరారు. పవన్ ది ఉడుకు రక్తమని - అందువల్ల కొద్దిగా ఆవేశం ఉంటుందని - అయితే, యాత్రలు చేసి సమయం వృథా చేయకూడదని అన్నారు. అయితే, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయమని సునీత చెప్పారు. సునీత మాటలు చూస్తుంటే....పవన్ పై టీడీపీ నేతల ఆశలు ఇంకా చావలేదని తెలుస్తోంది. నయానో భయానో....పవన్ ను మళ్లీ టీడీపీకి మద్దతిచ్చేలా చేయాలని చూస్తోంది. మరి, టీడీపీ-జనసేనల మధ్య తెగిన దారానికి ముడి వేస్తారో...ఇలాగే వదిలేస్తారో కాలమే సమాధానమివ్వాలి.