Begin typing your search above and press return to search.
‘పల్లె’ అనుభవమే ‘పరిటాల’కూ ఎదురైంది..
By: Tupaki Desk | 7 Aug 2016 9:31 AM GMT అనంతపురం జిల్లా టీడీపీలో విభేదాలు ముదురుతున్నాయి. దీంతో చంద్రబాబు పర్యటనల్లోనూ నేతల మధ్య కోపతాపాలు ఫ్లెక్సీలకెక్కుతున్నాయి. మంత్రి పదవి దక్కిన తర్వాత పరిటాల సునీత హవా ఓ రేంజ్ లో సాగుతున్నా ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గమూ బలంగానే ఉంది. జిల్లా మొత్తం తన హవాయే ఉండాలన్నట్టుగా పరిటాల సునీత తీరు ఉందని కొందరు టీడీపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. శనివారం ధర్మవరంలో సీఎం పర్యటన సందర్భంగా మరోసారి టీడీపీలో విబేధాలు బహిర్గతమయ్యాయి. సీఎం పర్యటన సందర్బంగా స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎక్కడా కూడా మంత్రి పరిటాల సునీత ఫొటో లేదు. అదే జిల్లాకు చెందిన మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫొటోను మాత్రం ప్లెక్సీలపై ముద్రించారు. ఇతర ఎమ్మెల్యేలకూ ప్లెక్సీల్లో చోటు కల్పించారు. కానీ, ఒక్క పరిటాల సునీత ఫొటో మాత్రం పెట్టలేదు.
కొద్దిరోజులుగా పరిటాల సునీతకు ఎమ్మెల్యే వరదాపురం సూరికి మధ్య నడుస్తున్న వివాదమే ఇందుకు కారణమని చెబుతున్నారు. ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఆధునికీకరణ పనుల కాంట్రాక్టు విషయంలోనే వీరి మధ్య గొడవ జరుగుతోంది. రూ. 33 కోట్ల విలువైన పనులు తమ వారికి ఇప్పించుకోవాలని సునీత ప్రయత్నిస్తుండగా… లోకల్ ఎమ్మెల్యే కాబట్టి తమకే కాంట్రాక్టు దక్కాలని సూరి డిమాండ్ చేస్తున్నారు. నిజానికి సీఎం పర్యటనలోనే పనులకు శంకుస్థాపనచేయాల్సి ఉంది. కానీ పరిటాల సునీతే కార్యక్రమాన్ని వాయిదా వేయాల్సిందిగా అధికారులను ఆదేశించారట. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. సునీత చెప్పినట్టు నా నియోజకవర్గంలో పనిచేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన అధికారులను హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సీఎం పర్యటనలో ఎక్కడా కూడా మంత్రి పరిటాల సునీత ఫొటోలు ఉండడానికి వీల్లేదని ఎమ్మెల్యే సూరి తన అనుచరులకు ఆదేశించారని చెబుతున్నారు. అయితే.. ఆ మధ్య రంజాన్ తోఫా సంచులపై ఫొటోల విషయంలో పరిటాల సునీత కూడా ఇలాగే వ్యవహరించారు. మరో మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫొటోలు లేకుండా సంచులను ముద్రించారు. నిజానికి మైనారిటీ శాఖ మంత్రి అయిన పల్లె రఘునాథరెడ్డి ఫొటో దానిపై ఉండాలి. కానీ... ఆయన ఫొటోను ముద్రించకుండా సునీత అడ్డుకున్నారన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. ఈ విషయంపై పల్లె సీఎంకు ఫిర్యాదు చేశారు కూడా. అయితే.. చంద్రబాబు నుంచి స్పందన లేకపోవడంతో ఇప్పుడు చంద్రబాబు పర్యటన సమయంలో తనకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్యే సూరి సహాయంతో పరిటాల బొమ్మన్నది కనపడకుండా చేశారని చెబుతున్నారు.