Begin typing your search above and press return to search.

ఇక..వెహికిల్ కొనటం అంత ఈజీ కాదు

By:  Tupaki Desk   |   23 Dec 2016 4:31 AM GMT
ఇక..వెహికిల్ కొనటం అంత ఈజీ కాదు
X
వెహికిల్ కొనాలనుకుంటున్నారా? అయితే.. మీ చేతిలో డబ్బులు ఉంటేనే సరిపోదు. చేతిలో క్యాష్ కానీ.. లోన్ తీసుకునే వెసులుబాటు ఉంటేనే వెహికిల్ రిజిస్ట్రేషన్ అయిపోదు. వెహికిల్ రిజిస్ట్రేషన్ కు కేంద్రం సరికొత్త రూల్ ను తీసుకురావాలని భావిస్తోంది. వెహికిల్ కొని..రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో.. దాన్ని నిలిపేందుకు అవసరమైన స్థలం ఉందన్న ధ్రువీకరణ పత్రం ఇచ్చిన తర్వాత మాత్రమే వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేసేలా నిర్ణయం తీసుకోనున్నారు.

రోడ్ల మీద వాహనాల రద్దీని తగ్గించే చర్యల్లో భాగంగా.. ఈ తరహా నిర్ణయాన్ని తీసుకోవాలని భావిస్తున్నట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. వాహనాల రిజిస్ట్రేషన్ విషయమై..కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీతో ఈ విషయమై మాట్లాడుతున్నామని.. కేంద్రం తీసుకోనున్న ఈ అంశంపై రాష్ట్రాలకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లుగా వెంకయ్య చెబుతున్నారు.

వాహనాల్ని రిజిస్ట్రర్ చేయటానికి దాన్ని నిలిపి ఉంచేందుకు అవసరమైన పార్కింగ్ ఏరియాను వాహనాదారుడు చూపించాలన్న నిర్ణయం ఆసక్తికరంగా మారటమే కాదు.. వాహనాల్ని కొనుగోలు చేసేందుకు సరికొత్త సమస్యల్ని తెర మీదకు తెస్తుందని చెప్పొచ్చు. మరీ.. నిర్ణయంపై ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంటుందన్నది పెద్ద ప్రశ్నగా చెప్పక తప్పదు. ఇప్పటికే పలు అంశాల మీద రేషన్ అమలు చేస్తున్న కేంద్రం.. వాహనాల పార్కింగ్ జాగా ఉంటేనే వాహనాల్ని రిజిస్ట్రేషన్ చేస్తామన్న నిర్ణయం సంచలనంగా మారుతుందనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/