Begin typing your search above and press return to search.

పార్ల‌మెంటే సుప్రీం!

By:  Tupaki Desk   |   24 Aug 2022 1:30 PM GMT
పార్ల‌మెంటే సుప్రీం!
X
దేశంలో శాస‌న వ్య‌వ‌స్థ‌కూ, న్యాయ వ్య‌వ‌స్థ‌కూ మ‌ధ్య పోరాటం సాగుతూనే ఉంది. ఏ వ్య‌వ‌స్థ గొప్ప. ఏది స‌ర్వాధికారాలు క‌లిగి ఉంది.. అని ఓ ప్ర‌శ్నాపూర్వ‌కం అయిన చ‌ర్చ న‌డుస్తూనే ఉంది. ఆంధ్రా అసెంబ్లీలో కూడా మొన్న‌టి వేళ ఇటువంటి చ‌ర్చే న‌డిచింది. ఇప్పుడు తాజాగా పార్ల‌మెంటే అంతిమ నిర్ణేత అని సీజే ఎన్వీ ర‌మ‌ణ తేల్చేశారు. నిన్న‌టి వేళ సుప్రీంలో ఉచిత ప‌థ‌కాల‌కు సంబంధించి దాఖ‌లైన పిల్ విచార‌ణ‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా సీజే చెప్పిన మాట‌లు కొన్ని చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ముఖ్యంగా ఎప్ప‌టి నుంచో శాస‌న వ్య‌వ‌స్థ‌లోకి న్యాయ వ్య‌వ‌స్థ చొర‌బాటు త‌ప్ప‌న్న వాద‌న ఉంది. అంటే శాస‌న వ్య‌వ‌స్థ అన్న‌ది చ‌ట్టాలు చేశాక వాటిని అమ‌లు చేసే బాధ్య‌త న్యాయ వ్య‌వ‌స్థ‌ల‌పై ఉంది. అమ‌లు అన్న‌ది పెద్ద స‌మ‌స్య గా ఉంది. కొన్నింట శాస‌న వ్య‌వ‌స్థ చెప్పిన వాటికీ ఆమోదం లేకుండా పోతోంది న్యాయ వ్య‌వ‌స్థ నుంచి !

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌య‌మై త‌మ మాటే చెల్లుబాటు కావాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం చెప్పింది. రైతులకు జరగుతున్న అన్యాయం గురించి హై కోర్టు అభ్యంత‌రాలు కొన్నింటిని రైజ్ చేసింది. అమ‌రావ‌తి విష‌య‌మై ఆ రోజు జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌లు కూడా త‌ప్పు ప‌ట్టింది.

ఇవ‌న్నీ ఓ వైపు ఉంటే., మూడు రాజ‌ధానుల బిల్లు కూడా న్యాయ‌వ్య‌వ‌స్థ లో ఇర‌కాటంలో ప‌డ‌డంతో దానిని కూడా ప్ర‌భుత్వం కొట్టేసింది. ఎలా చూసుకున్నా వైసీపీ పెద్దలు కోర్టును ఉద్దేశించి ఆ రోజు కొన్ని వ్యాఖ్యలు చేయ‌డంతో ఆ కేసు ఇప్ప‌టికీ న‌డుస్తోంది. ఓ తీర్పును ప్ర‌శ్నించ‌డం,స‌వాలు చేయ‌డం, అభిప్రాయం చెప్ప‌డం ఈ మూడు కూడా మంచి భాష‌కు లోబ‌డే ఉండాలి కానీ మ‌న ద‌గ్గ‌ర అవి లేవు. కనుక కోర్టుల జోక్యం ప్ర‌తిచోటా త‌ప్ప‌ని స‌రి అవుతోంది.

"ఏది ఎలా ఉన్నా పార్ల‌మెంటే ఫైనల్. కానీ ఓ చ‌ట్టం పౌరుల జీవ‌న విధానాల‌ను స‌మ‌స్యాత్మ‌కంగా మారిస్తే, ఓ చ‌ట్టం ఏక‌ప‌క్షంగా ఉంటే వాటిని సవాలు చేసే హ‌క్కు కూడా సంబంధిత వ‌ర్గాలకు ఉంటుంది. అప్పుడు న్యాయ స్థానాలు చెప్పే మాట‌లు లేదా చేసే స‌వ‌ర‌ణ‌లు విని శాస‌న వ్య‌వ‌స్థ‌లో వాటి మార్పులు అన్న‌వి అమ‌లు అయి ఉండాలి.

ఇవేవీ లేకుండా ఉంటే పౌరుల హ‌క్కుల ఏక‌ప‌క్షంగా కొంద‌రి చేతుల్లోనే ఉండిపోతాయి అన్న ఆందోళ‌న కూడా ఉంది. ఇవ‌న్నీ ఎప్ప‌టిక‌ప్పుడు మార్పుల‌కు నోచుకోవాల్సిన విష‌యాలు.." అన్న వాద‌న ఒక‌టి సోష‌ల్ మీడియాలో వినిపిస్తుంది.