Begin typing your search above and press return to search.

త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్.. 21 నెలలు టార్గెట్!

By:  Tupaki Desk   |   14 Aug 2020 7:00 AM GMT
త్రిభుజాకారంలో కొత్త పార్లమెంట్.. 21 నెలలు టార్గెట్!
X
మోడీ సర్కార్ మరో సాహసోపేతమైన నిర్ణయానికి అడుగులు వేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పురావడం ఆలస్యం కొత్త పార్లమెంట్ కట్టేందుకు రెడీ అవుతోంది. కేవలం 21 నెలల్లోనే పూర్తి చేయాలని సంకల్పించింది.

భారత్ 75వ స్వాతంత్ర్య వేడుకలు (వజ్రోత్సవాలు) 2022 ఆగస్టు 15న జరగబోతున్నాయి. ఆ సమయానికి కొత్త పార్లమెంట్ భవనంలోనే ఉభయ సభల సమావేశాలు జరిగేలా కొత్త భవనం నిర్మించాలని మోడీ సర్కార్ ప్లాన్ చేసింది.

85 ఏళ్ల క్రితం బ్రిటీష్ వారి హయాంలో కట్టారు మన భారత పార్లమెంట్ భవనం. ఇప్పటికీ ఇది మన లోక్ సభ, రాజ్యసభకు వేదికగా ఉంది. అయితే ఈ బిల్డింగ్ ప్రస్తుత అవసరాలకు సరిపోవడం లేదు. దాంతోపాటు ఇందులో ఫైర్ సేఫ్టీ సహా మౌలిక సదుపాయాలు లేవు. రక్షణ పరంగా కూడా ఆమోదయోగ్యంగా లేదు.

ప్రస్తుత పార్లమెంట్ భవనం.. ప్రపంచ వారసత్వ సంపదగా ఉంది. దీంతో దీన్ని చెక్కు చెదరకుండా భావితరాలకు అందించాలి. అందుకే మోడీ సర్కార్.. అవసరాలకు సరిపోని ప్రస్తుత పార్లమెంట్ స్థానంలో కొత్త పార్లమెంట్ భవనం నిర్మించాలని యోచిస్తున్నారు.

ఇప్పటికే యూపీఏ2 హయాంలోనే నాటి ప్రభుత్వం ఓ కమిటీని కొత్త పార్లమెంట్ కోసం వేసింది. ఇక రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గత ఏడాది ఆగస్టు 5న కొత్త భవనం నిర్మించాలని ప్రధాని మోడీకి ప్రతిపాదించారు. అయితే కరోనా కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది.

గుజరాత్ కు చెందిన బిమల్ పటేల్ ఆర్కిటెక్ట్ సంస్థ ‘హెచ్.సీ.పీ డిసైన్స్’ కొత్త పార్లమెంట్ రూపకల్పన బాధ్యతలు చేపట్టింది. నూతన భవనాన్ని రూ.889 కోట్లతో పూర్తి చేయాలని కేంద్రం బడ్జెట్ నిర్ణయించింది. త్రిభుజాకారంలో ప్రస్తుత పార్లమెంట్ ను డిజైన్ చేశారు. పాత పార్లమెంట్ తరహాలోనే ఈ కొత్త పార్లమెంట్ డిజైన్ తీర్చిదిద్దారు. 21 నెలల్లోనూ పూర్తి కావాలన్నది ప్రభుత్వం లక్ష్యం. ఇక 20 వేల కోట్లతో పార్లమెంట్ చుట్టుపక్కల ప్రభుత్వ భవనాలన్నింటిని ఏర్పాటు చేయాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ప్రభుత్వ అద్దె భవనాల కోసం ఏటా 1000కోట్లను కేంద్రం వెచ్చిస్తోంది. దీంతో అన్ని ప్రభుత్వ సంస్థలు ఒకే చోట ఉండేలా ప్లాన్ చేస్తోంది. తద్వారా దూరభారం.. తగ్గి ప్రజలకు, అధికారులకు సేవలు అందుతాయి.

కొత్త పార్లమెంట్ లో ఒకేసారి 1345మంది సభ్యులు ఉమ్మడి పార్లమెంట్ లో కూర్చేనే స్థాయిలో సువిశాలంగా సెంట్రల్ మాల్ ను నిర్మిస్తున్నారు.

దీన్ని రాష్ట్రపతి భవన్ కు దక్షిణాన ప్రధానమంత్రి అధికారిక నివాసం.. ఉపరాష్ట్రపతికి కొత్త అధికార నివాసం ఏర్పాటు చేస్తూ ఈ ప్రాజెక్టుకు ‘సెంట్రల్ విస్తా’ అని పేరు పెట్టారు.