Begin typing your search above and press return to search.
ఏపీ పరువు పోతోందిగా జగనన్నా..!!
By: Tupaki Desk | 22 Dec 2022 9:35 AM GMTగత వారం రోజుల్లో పార్లమెంటులో వెలుగు చూసిన అనేక విషయాలను పరిశీలిస్తే.. ఏపీ పరువు ఏ రేంజ్‌లో పోయిందో అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు. పార్లమెంటులో ఇతర రాష్ట్రాల సభ్యులు సహా.. వైసీపీ ఎంపీలు కూడా అనేక ప్రశ్నలు సంధించారు. వీటికి కేంద్రం ఇచ్చిన సమాధానాలు పరిశీలిస్తే.. ఏపీ పరువు ఏ రేంజ్‌లో పోయిందో ఇట్టే అర్ధమవుతోందని అంటున్నారు పరిశీలకులు.
వ్యభిచారంలో నెంబర్ 1: ఏపీలో వ్యభిచారం చేసేవారి సంఖ్య.. దేశంలోనే ఎక్కువగా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో మహారాష్ట్రకు ఉన్న ట్రాక్ రికార్డును ఏపీ సొంతం చేసుకుందని తెలిపింది. అంతేకాదు.. వ్యభిచార వలసలు కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీనే ముందుందని తెలిపింది.
గంజాయి రవాణ: గంజాయి ఉత్పత్తి, రవాణాలో ఏపీ దేశంలోనే నెంబర్ 1గా ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఎంపీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ.. ప్రస్తుతంఉన్న లెక్కల ప్రకారం.. ఏపీ మన్యం జిల్లాల్లో గంజాయి ఉత్పత్తి, రవాణా ఎక్కువగా ఉందని తెలిపారు.
ఐటీలో 23: అత్యంత కీలకమైన ఐటీ రంగంలో ఏపీ ఏకంగా 28 రాష్ట్రాల్లో 23వ స్థానంలో ఉండడం గమనార్హం. గతంలో ఇది అంటే..చంద్రబాబు హయాంలో 5వ స్థానంలో ఉంటే.. ప్రస్తుతం.. ఇది 23 వ స్థానానికి చేరుకుందని కేంద్రం స్పష్టం చేసింది.
వలస కూలీలు 3 : రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు వలస పోతున్నవారిలో బిహార్, తెలంగాణ తర్వాత.. రాష్ట్రం ఏపీనేనని.. కేంద్రం ప్రకటించింది. అంటే.. ఇక్కడ ఉపాధి, ఉద్యోగాలు కరువయ్యాయని చెప్పకనే చెప్పేసింది.
నేరాలు-ఘోరాలు 3: నేరాలు ఘోరాలు, అత్యాచారాల లెక్కల్లో ఏపీ 3వ స్థానంలో ఉందని తెలిపింది. యూపీ, బిహార్ ల సరసన ఏపీ చేరడం ఇదే తొలిసారి కూడా కేంద్రం వెల్లడించడం గమనార్హం. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడుల్లోనూ ఏపీ ముందు వరుసలో ఉందని కేంద్రమే కుండబద్దలు కొట్టింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.