Begin typing your search above and press return to search.
అద్భుతం; శ్రీవారి చెంతకొచ్చిన రామచిలక
By: Tupaki Desk | 20 Sep 2015 9:21 AM GMTకలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి గర్భాలయంలో ఒక అద్భుతంగా చోటు చేసుకుంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిత్యం ఒక ఒక అలంకారం చేయటం మామూలే. యథావిధిగా ఆదివారం మోహిని అవతారంలో అలంకరించారు.
ఎక్కడ నుంచి వచ్చిందో కానీ ఒక రామచిలుక గుడిలోకి ప్రవేశించటమే కాదు.. గర్భగుడిలోకి వచ్చేయటం భక్తులు ఒక్కసారిగా విస్మయానికి గురి అయ్యారు. మరో విశేషం ఏమిటంటే.. అలా వచ్చిన రామచిలుక.. అచ్చం మోహీనీ అవతారం లో భాగంగా తయారు చేసిన రామచిలుక మాదిరే ఉండటం మరో విశేషంగా చెప్పొచ్చు.
గుడిలోకి రామచిలుక ప్రవేశించటమే అరుదైతే.. ఏకంగా అది గర్భాలయంలోకి ప్రవేశించటం శ్రీవారి లీలగా భక్తులు అభివర్ణిస్తున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలైన ఐదో రోజు ఈ విశేషం చోటు చేసుకుంది. భక్తులు.. అధికారులు.. ఆలయ సిబ్బంది ఆ విషయం గురించి ఆసక్తికరంగా చర్చించుకోవటం కనిపించింది.