Begin typing your search above and press return to search.
చంద్రబాబువి హత్యారాజకీయాలుః పార్థ సారథి
By: Tupaki Desk | 9 July 2017 12:55 PM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై కక్ష తీర్చుకొని తీరతామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పార్థసారథి అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలన కొనసాగుతోందని మండి పడ్డారు. మూడేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు పెద్దగా చేసిందేమీ లేదన్నారు. కోట్లు సంపాదించడం, హత్యారాజకీయాలు చేయడం లక్ష్యంగానే చంద్రబాబు ముందుకెళుతున్నారని ధ్వజమెత్తారు.
గుంటూరులో జరుగుతున్నజాతీయ ప్లీనరీ సందర్భంగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై దాడుల అంశంపై తీర్మానాన్ని పార్థసారథి ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని పార్టీ నేత నందమూరి లక్ష్మీపార్వతి బలపరిచారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ అమరావతిని చంద్రబాబు సింగపూర్ రాబందులకు కట్టబెట్టారని పార్థసారథి మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో వైసీపీ తప్పక విజయం సాధిస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలో అవినీతి పాలనను అంతం చేస్తామన్నారు. సుపరిపాలనను అందించి చంద్రబాబుపై అంతకంతకు కక్ష తీర్చుకొని తీరతామన్నారు. ఇసుక దందాతో టీడీపీ నేతలు కోట్ల రూపాయల కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పాపపు సొమ్ముతో ఓట్లు కొనాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఓటుకు రూ.5వేలు ఇస్తానని నంద్యాలలో బహిరంగంగా చెప్పడం ఆయన నీతి నిజాయితీలకు నిదర్శనమన్నాను. చంద్ర బాబుకు నిజంగా దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారితో రాజీనామా చేయించి మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కడం చంద్రబాబు జేజమ్మ తరం కాదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం అని స్పష్టం చేశారు.