Begin typing your search above and press return to search.

పార్టీ ఇష్యూ: హీరో విజయ్ కి తండ్రికి గొడవ

By:  Tupaki Desk   |   8 Nov 2020 5:40 PM GMT
పార్టీ ఇష్యూ: హీరో విజయ్ కి తండ్రికి గొడవ
X
తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి వస్తాడా? రాడా అన్నదే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్. ఆయన పొలిటికల్ ఎంట్రీపై రచ్చరచ్చ జరుగుతోంది. ఇప్పటికే రజినీకాంత్ తమిళ రాజకీయాల్లోకి రావడానికి నాన్చుతుండగా.. తాజాగా విజయ్ సైతం మీనమేశాలు లెక్కిస్తున్నారు.

తాజాగా స్టార్ హీరో విజయ్ తండ్రి ఏర్పాటు చేసిన పార్టీ వివాదం రచ్చ రచ్చగా మారింది.
విజయ్ తండ్రి ఎస్.ఐ.చంద్రశేఖరన్ ఇటీవల మాట్లాడుతూ దళపతి విజయ్ పేరుతో పార్టీని రిజిస్టర్ చేశామని.., హీరో విజయ్ కి దాని గురించి తెలియదు అని క్లారిటీ ఇచ్చారు. “ఇది విజయ్ రాజకీయ పార్టీ కాదు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తారా లేదా అనేది నేను వ్యాఖ్యానించలేను ”అని ఎస్‌ఐ చంద్రశేఖరన్ అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం కథలో ఇది పెద్ద మలుపుగా మారింది.

ఈ వార్తలపై ఎట్టకేలకు అధికారికంగా విజయ్ స్పందించారు. తాను ఎలాంటి రాజకీయ పార్టీని స్థాపించలేదని.. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ పార్టీని పెట్టారని.. దానికి తనకు ఎలాంటి సంబంధం లేదని హీరో విజయ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ కార్యకలాపాల్లో తన పాత్ర.. తన అభిమాన సంఘాల పాత్ర ఉండదని తెలిపారు. అలాగే పార్టీ తన తండ్రిది కాబట్టి అభిమానులను వెళ్లి అందులో చేరమని తాను చెప్పనని.. ఒకవేళ తన పేరును, ఫొటోను రాజకీయాల్లో దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం ఆలోచించనని విజయ్ హెచ్చరించారు.

దీంతో రాజకీయంగా పార్టీ విషయంలో తండ్రీ, కొడుకుల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. విజయ్ ను రాజకీయాల్లో తేవడానికి తండ్రిగా తన బాధ్యత అంటూ చంద్రశేఖర్ దూకుడు చూపుతుండగా.. విజయ్ మాత్రం రాజకీయాల్లో రానని.. తన పేరు వాడితే తండ్రిపైనా చర్యలు తప్పవని హెచ్చరించాడు. తండ్రి ఏమో తమిళ పాలిటిక్స్ లో కొడుకును అందలం ఎక్కించాలని చూస్తున్నాడు. అయితే కొడుకు హీరో విజయ్ మాత్రం ససేమిరా అంటుండడంతో ఈ వివాదం తమిళనాట తండ్రీకొడుకుల మధ్య చిచ్చుపెట్టింది.