Begin typing your search above and press return to search.
టిక్కెటే రాకుంటే.. ఘోరం జరిగేదే కాదు!
By: Tupaki Desk | 5 Nov 2015 5:30 PM GMTఈ విషాదానికి రాజకీయ రంగు ఉండడం అనేది కేవలం యాదృచ్ఛికం! కానీ సారిక, ఆమె ఎనిమిదేళ్ల కొడుకు అభినవ్ - నాలుగేళ్లు కూడా లేని కవల పిల్లలు ఆయాన్ - శ్రీయాన్ లు ఘోరమైన అగ్నిప్రమాదంలో దుర్మరణం పాలవడం అనేది ఎవరినైనా కలచివేసే అంశం. అయితే ఈ ఘోరం జరగడానికి మూల కారణం ఏమిటి? ఎవరికి తోచిన రీతిలో వారు రకరకాలుగా విశ్లేషించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కొందరిలో ఒక వాదన వినిపిస్తోంది. అసలు కాంగ్రెస్ పార్టీ గనుక.. రాజయ్యకు టిక్కెట్ ఇవ్వకుండాదూరం పెట్టి ఉంటే గనుక.. అసలు ఈ ఘోరమే జరిగేది కాదని అంటున్నారు. ఆల్రెడీ గృహహింస కేసు కింద కోడలిని వేధిస్తున్నట్లుగా చార్జిషీటు కూడా నమోదై..కోర్టులో విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి తప్ప వేరే గత్యంతరం లేనట్లుగా కాంగ్రెస్ పార్టీ రాజయ్యకే టిక్కెట్ ఇవ్వడం వల్లనే ఈనాడు ఈ ఘోరం జరిగిందని పలువురు అంటున్నారు.
ఈ అనుమానాస్పద మరణాలకు మూల కారణాలుగా రెండు కనిపిస్తున్నాయి. ఒకటి- రాజయ్య కు టిక్కెట్ ఇవ్వవద్దంటూ సారిక ఏఐసీసీ కి లేఖ రాసింది. దాని మీద వారు విచారించడంతో, రాజయ్య ఇంటికి వచ్చి అలా లేఖ రాసినందుకు కోడలితో తగాదా పెట్టుకున్నారడు.
రెండు- రాజయ్యకు ఆ ఇంటి నుంచే ఎన్నికల నామినేషన్ కు వెళ్లడం అనేది ఒక సెంటిమెంటు. అందుకే నామినేషన్ ముందుగా చాన్నాళ్లుగా ఆ ఇంటి ఛాయలకు రాకపోయినప్పటికీ.. ఆ ఇంట్లో ఉండి అక్కడినుంచి బయల్దేరి నామినేషన్ కు వెళ్లడానికి ఆ ఇంటికి వచ్చాడు.
ఇంటికి వచ్చారు గనుకనే.. కోడలితో వాగ్వాదం జరిగింది. ఆమె తనకు ద్రోహం చేసినందుకు గాను.. తాను మళ్లీ ఆందోళన చేస్తానంటూ మామను హెచ్చరించింది. వారి మధ్య తీవ్రస్థాయిలో తగాదా జరిగింది. అదే చావుల వరకు దారితీసింది.
అంటే ఇక్కడ అందరూ చెబుతున్న సంగతేంటంటే.. అసలు రాజయ్యకు టిక్కెట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ కాస్త నైతిక విలువలు పాటించి ఉంటే గనుక..అలాంటి గృహహింస కేసు నిందితుడిని ప్రోత్సహించకుండా ఉంటే గనుక.. ఇవాళ ఇన్ని చావులు కూడా జరిగి ఉండేవికాదని అంటున్నారు. తిరిగి తిరిగి జనం దృష్టిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఒక పొరబాటు నిర్ణయం వలన.. ఇవాళ కొన్ని ప్రాణాలు అన్యాయం అయిపోయాయి గదా అనే సానుభూతి వ్యక్తం అవుతోంది.