Begin typing your search above and press return to search.
పరుచూరి వారి కోరిక : పవన్ గొంతు అక్కడ నుంచి వినాలి
By: Tupaki Desk | 7 Sep 2022 11:30 PM GMTపవన్ కళ్యాణ్ సినీ నటుడు కm రాజకీయ నాయకుడు. ఆయనలో ఏదో చేయాలన్న తపన ఉంది. అందుకే జనసేన పేరిట రాజకీయ పార్టీని స్థాపించారు. గత ఎనిమిదేళ్ళుగా ఆయన తన పార్టీని ఎన్ని కష్టాలైనా మెల్లిగా లాక్కువస్తున్నారు. 2019 ఎన్నికల్లోనే ఆయన గెలిచి అసెంబ్లీలో ఉండాల్సి ఉంది కానీ ఆయన పోటీ చేసిన రెండు చోట్లా ఓటమి పాలు అయ్యారు. ఒక విధంగా పవన్ కి జనసైనికులకు అది భారీ షాక్ లాంటిదే.
ఆ తరువాత జనసేన ఉండదని కూడా జోస్యాలు చెప్పేవారు చెప్పారు. కానీ అక్కడ ఉన్నది పవన్. ఆయన తన పట్టుదలతో జనసేనను మునుకు నడిపిస్తున్నారు. 2024 నాటికి ఏపీ రాజకీయాల్లో జనసేన కీలకం అన్నట్లుగా పరిస్థితిని తీసుకువచ్చారు అంటే పవన్ గ్రేట్ అనుకోవాల్సిందే. ఇక 2024లో కనుక ఎన్నికలు జరిగితే జనసేన కచ్చితంగా మంచి నంబర్ తో సీట్లు సాధిస్తుంది అని కూడా రాజకీయ విశ్లేషణలు ఉన్నాయి.
ఈ టైం లో ప్రముఖ సినీ మాటల రచయిత, మాటల మాంత్రికుడు అయిన పరుచూరి గోపాలక్రిష్ణ పవన్ కళ్యాణ్ మీద తనకు ఉన్న అభిమానాన్ని ఒక తన యూట్యూబ్ చానల్ లో ఒక వీడియో చేసి గట్టిగా చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ కి కాస్తా ఆలస్యంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన పరుచూరి ఆయనతో పాటు జనసైనికులకు ఫుల్ ఖుకషీని ఇచ్చే మంచి మాటలను ఓ నాలుగు చెప్పారు.
పవన్ కళ్యాణ్ కోరిక ఈసారి తప్పకుండా తీరుతుందని పెద్దాయన పరుచూరి దీవించేశారు. పవన్ లాంటి వారు అసెంబ్లీలో ఉండాలని ఆయన మనసారా కోరుకున్నారు. పవన్ కి కమిట్ మెంట్ ఉంది. సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉంది. అలాంటి వారు రాజకీయాల్లో అరుదు అని కూడా పొగిడారు. పవన్ కనుక ఎన్నికల్లో గెలవాలనుకుంటే ఏదో పార్టీలో చేరవచ్చు అలా కాకుండా సొంతంగా పార్టీ పెట్టి ఆయన పోరాడుతున్నారని, ఆయన వీరుడని కూడా కితాబు ఇచ్చారు.
పవన్ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతారని, చట్ట సభలో ఆయన బలమైన వాణిని వినిపిస్తారని కూడా పరుచూరి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వారు సభలో ఉంటే సమాజానికి మంచి చేసే విషయాలు ప్రస్థావిస్తారని కూడా ఆయన అంటున్నారు. ఇక పవన్ తో తనకు సన్నిహిత పరిచయం ఉంది. ఆయన మంచి వారని, సమాజ హితం కోరే మనిషి అని కొనియాడారు.
పవన్ కళ్యాణ్ తన సినిమాలలో మంచి సబ్జెక్టులను ఎంచుకోవాలని, బొబ్బిలి పులి జస్టిస్ చౌదరి లాంటి మెసేజ్ ఇచ్చే సబ్జెక్టులతో ఆయన సినిమాలు చేయడం ద్వారా సమాజానికి తన వాణిని పంపించవచ్చు అని సూచించారు. దాని వల్ల పవన్ ఆశయాలు జనాలకు సులువుగా చేరుతాయని ఆయన అన్నారు. మరి ఈ సీనియర్ డైలాగ్ రైటర్ నోటి చలవ వల్ల పవన్ ఈసారి అసెంబ్లీలో కనిపించి తన బలమైన వాణిని వినిపించాలని అంతా కోరుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.