Begin typing your search above and press return to search.

రసూల్ కి ఇదేం పోయే కాలం..?

By:  Tupaki Desk   |   28 Jan 2017 7:11 AM GMT
రసూల్ కి ఇదేం పోయే కాలం..?
X
దాదాపు 130కోట్ల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహించే అద్భుత అవకాశం.. అది కూడా టీమిండియాలో స్థానం అంటే అంత తేలికైన ముచ్చట కాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని చేజిక్కించుకున్న వేళ.. మరింత బాధ్యతగా వహించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఆ విషయాన్ని మర్చిపోయినట్లగా కనిపిస్తోంది టీమిండియా క్రికెటర్ పర్వేజ్ రసూల్. భారత టీ20 జట్టుకు కశ్మీర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏకైక క్రికెటర్ గా గుర్తింపు పొందిన రసూల్.. తాజాగా చేసిన ఒక చేష్ట సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలకు గురి చేస్తోంది.

ఇంగ్లండ్ జట్టుతో ఇటీవల జరిగిన టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ సమయంలో టీమిండియా సభ్యులంతా తదేకదీక్షతో.. జాతీయగీతాన్ని ఆలపిస్తుండగా.. రసూల్ మాత్రం అందుకు భిన్నంగా చూయింగ్ గమ్ నములుతూ నిర్లక్ష్యంగా ఉండటంపై పలువురు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

జాతీయగీతాన్ని ఆలపించటం కంటే చూయింగ్ గమ్ నమలటమే రసూల్ కు ముఖ్యమా? అన్న డౌట్ ను ఒకరు వ్యక్తంచేస్తే.. భారత జెర్సీ ధరించి కూడా జాతీయగీతాన్ని ఆలపించటకపోవటం తనకు నిరాశను కలిగించిందంటూ మరొకరు ట్వీట్చేశారు. ఒకవేళ జాతీయ గీతాన్ని ఆలపించటం రసూల్ కు ఇష్టం లేని పక్షంతో భారత జెర్సీ ధరించాల్సిన అవసరమే లేదు కదా? అని కొందరు మండిపడ్డారు. అరుదైన అవకాశాలు లభించిన వారు.. తమనుకోట్లాదిమంది గమనిస్తారన్న విషయాన్ని గుర్తు పెట్టుకోకపోవటం ఏమిటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/