Begin typing your search above and press return to search.
కరోనా టెస్టుల పేరుతో ప్రయాణికుల నిలువు దోపిడీ!
By: Tupaki Desk | 15 Jan 2021 12:03 PM GMTహైదరాబాద్ లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా టెస్టుల పేరుతో ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్న వైనం వెలుగుచూసింది. ఇదే అదునుగా భారీ రేట్లు పెట్టి ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు.
బయట వందల్లో ఉన్న ధరలకు విమానాశ్రయంలో వేలు వసూలు చేస్తూ దోచుకుంటున్నారు. తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెస్టుల దందా వెలుగుచూసింది.
విదేశాల నుంచి వచ్చిన వారి దగ్గర విమానాశ్రయ అధికారులు, వైద్య సిబ్బంది రూ.4వేలు వసూలు చేస్తున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టుకు రూ.750 అయితే రూ.4వేలు గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదే బయట చేయించుకుంటామంటే విమానాశ్రయ అధికారులు, వైద్య సిబ్బంది వినకుండా క్వారంటైన్ చేస్తామని.. టెస్టు చేయించుకోవాలంటూ బెదిరిస్తున్నారని ప్రయాణికులు వాపోతున్నారు.