Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రికి డైపర్ రిక్వెస్ట్ పెట్టేశారు

By:  Tupaki Desk   |   13 Oct 2016 8:02 AM GMT
కేంద్రమంత్రికి డైపర్ రిక్వెస్ట్ పెట్టేశారు
X
మంచితనాన్ని ఆసరాగా తీసుకోవటం సరికాదు. ప్రాణాల మీదకు ఏదైనా రావటం.. తీవ్ర సమస్యల్లో చిక్కుకున్న వేళ సాయం అడగటం తప్పేం కాదు. కానీ.. చిన్న చిన్న అవసరాలకు సైతం కేంద్ర మంత్రుల్ని వాడేసుకుంటున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మోడీ సర్కారులో యమా యాక్టివ్ గా వ్యవహరించే కేంద్ర మంత్రుల్లో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ లు ముందుంటారు. తమ శాఖలకు సంబంధించి ఏదైనా సమస్య వచ్చి.. సాయం అడిగినంతనే స్పందించే గుణం వీరిలో ఉంటుంది.

దీనికి సంబంధించి ఎన్నో ఉదాహరణలు ఇప్పటికే ఉన్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. అయితే.. సాయం కోరిన వ్యక్తి.. అతగాడు కోరిన సాయంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే.. కేంద్రమంత్రి మాత్రం కోరిన సాయం సమంజసమైనదేనా? కాదా? అన్నది పట్టించుకోకుండా పాజిటివ్ గా రియాక్ట్ అయి సాయం చేశారు.

పలువురి విమర్శలకు గురైన సదరు సాయం ఏమిటంటే.. తన చిన్నారి పాపతో కలిసి రైలు ప్రయాణం చేస్తున్న ప్రభాకర్ ఎస్ ఝు అనే వ్యక్తి.. తన చిట్టిపాపకు డైపర్ (పిల్లలకు వాడేది) అవసరమైందని.. దయచేసి తనకు అందేలా చేయాలని కోరారు. దీనికి కేంద్ర మంత్రి స్పందించి.. సదరు వ్యక్తి కోరినట్లుగా డైపర్ ను అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. స్పందిస్తున్నారు కదా అని కేంద్రమంత్రి లాంటి వ్యక్తికి ఇలాంటి చిన్నచిన్న అవసరాలకు సాయాన్ని కోరటాన్ని పలువురు తప్పు పడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/