Begin typing your search above and press return to search.
రీల్ సీన్ కాదు రియల్: కుప్పకూలిన పైలెట్.. ఫ్లైట్ నడిపిన ప్రయాణికుడు
By: Tupaki Desk | 13 May 2022 5:19 AM GMTనిజానికి ఇలాంటివి సినిమాల్లో మాత్రమే కనిపిస్తాయి. కానీ..రీల్ కు ఏ మాత్రం తీసిపోని ఈ రియల్ ఉదంతం విన్నంతనే విస్మయానికి గురి చేస్తుంది. ఈ అరుదైన ఉదంతం అమెరికాలో చోటు చేసుకుంది. విమానాన్ని నడుపుతున్న పైలెట్ కు అస్వస్థతకు గురి కావటం.. కుప్పకూలిపోవటం జరిగింది.
ఆ వెంటనే పైలెట్ బాధ్యతల్ని చేపట్టిన ప్రయాణికుడు విమానాన్నిసేఫ్ గా ల్యాండ్ చేసి రియల్ హీరో అయ్యారు. అసలేమైందంటే..
ఫ్లోరిడా అట్లాంటిక్ తీరంలో ఒక చిన్న సైజు విమానం టేకాఫ్ అయ్యింది. కాసేపటికే పైలెట్ అనారోగ్యానికి గురయ్యాడు. ఆ వెంటనే కుప్పకూలాడు. దీంతో.. ఎవరైనా సాయం చేస్తారా? అని అనౌన్స్ చేశారు. దీనికి ఫోర్ట్ పీర్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించాడు.
సింగిల్ ఇంజిన్ సెస్నా 280 పొజిషన్ తెలుసా? అని ప్రయాణికుడ్ని అడగ్గా..తనకేమీ తెలీదని చెప్పాడు. అయితే.. ఆందోళన చెందొద్దన్న మాటను చెప్పి.. అతడున్న సీటు నుంచే విమానాన్ని నడిపేలా కంట్రోల్స్ ను ఎనేబుల్ చేశారు ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది.
తాము చెప్పింది చేయాలని.. టెన్షన్ పడొద్దని సర్ది చెప్పారు. వింగ్స్ లెవెల్ జాగ్రత్తగా చూడమని చెప్పటంతో పాటు.. కొద్దిసేపటికే సదరు విమానం ఎక్కడ ఉందో గుర్తించారు. వెంటనే సదరు విమానాన్ని పాల్మ్ బీచ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు అనుసంధానించారు.
ఆ తర్వాత నుంచి ప్రయాణికుడితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ.. విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేశారు. పైలెట్ ను.. ప్రయాణికుడ్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విన్నంతనే సినిమా సీన్ లా ఉన్న ఈ ఉదంతం రియల్ గా చోటు చేసుకోవటం.. ఎండింగ్ హ్యాపీగా ఉండటం చాలా అరుదైన అంశంగా చెప్పక తప్పదు.